haircut:భార్య హెయిర్ కత్తిరిస్తోందట, సెలూన్ షాపు ఓపెన్ చేయండి, కేటీఆర్‌కు ట్వీట్, కోహ్లి లాగా..
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు బంద్.. ఇందుకు హెయిర్ కట్ సెలూన్లకు మినహాయింపేమీ లేదు. అయితే నెలరోజులకు పైగా సెలూన్లు మూసివేసి ఉండటంతో కటింగ్, గడ్డం పెరుగుతోంది. ఈ సమస్యను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కూడా తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు.
యాక్టివ్..
మంత్రి కేటీఆర్.. అనునిత్యం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అడిగే సందేహాలకు సమాధానం ఇస్తుంటారు. సమస్యకు పరిష్కారం కూడా చూపుతుంటారు. అయితే ఇటీవల ఆయనకు విచిత్రమైన సమస్యను ప్రస్తావించాడు ఓ నెటిజన్. రెండో విడత లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు ఉన్నా.. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఉన్నాయి. ఇందులో సెలూన్లను కూడా చేర్చాలని ఔత్సాహికులు కోరుతున్నారు.

ఓపెన్ చేయండి.
ఏప్రిల్ 20 తర్వాత బార్బర్ షాపులను తెరవాలని కోరారు. లేదంటే తన భార్య వెంట్రుకలు కట్ చేయిస్తానని చెబుతోంది. ఒకవేళ మీరు సెలూన్ షాపులను తెరవకుంటే తన వెంట్రుకలను తన భార్య కత్తిరించడం ఖాయం అని పేర్కొన్నాడు. ఒకవేళ అదే జరిగితే.. తాను లాక్ డౌన్ ఎత్తివేసిన బయటకు రాలేని పరిస్థితి అని వివరించారు. దీనికి మంత్రి కేటీఆర్ కూడా అదేస్థాయిలో సమాధానం ఇచ్చారు.

కోహ్లి లాగా..?
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ.. అతని హెయిర్ ట్రీమ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. క్రికెట్ ఆరాధించే మీరు.. కోహ్లిని ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు అని కేటీఆర్ అడిగారు. మంత్రి సమాధానంతో నెటిజన్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తర్వాత కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు.
Recommended Video

వదినకు ఛాన్స్ ఇస్తున్నారా..?
అన్నయ్య మీరు కూడా వదినకు ఛాన్స్ ఇస్తున్నారా అని కవిత ట్వీట్ చేశారు. మీ హెయిర్ స్టైల్ కూడా వదిన సెట్ చేస్తున్నారా అని అడిగారు. అన్నయ్యతో తనకున్న చనువుతో కవిత ట్వీట్ చేశారు. కేటీఆర్ రిప్లై.. అందుకు కవిత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేటీఆర్ రిప్లైను నెటిజన్లు స్వాగతిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications