కేటీఆర్ బర్త్‌డే: ‘డైనమిక్ లీడర్’ అంటూ మహేశ్, హరీశ్, లోకేష్ సహా సినీ రాజకీయ ప్రముఖుల విషెస్

Recommended Video

    తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

    హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం(జులై 24న) 42వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    మంచి స్నేహితుడు.. డైనమిక్ లీడర్

    మంచి స్నేహితుడు.. డైనమిక్ లీడర్

    ‘రాష్ట్రం కోసం కష్టపడుతున్న మా నాయకుడు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు' అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ‘మంచి స్నేహితుడు, అద్భుతమైన నాయకుడు, డైనమిక్‌ వ్యక్తి..హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌' అంటూ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు.

    ఈషా రెబ్బ ఇలా..

    నాకెంతో ఇష్టమైన రాజకీయనేత, ప్రజల నాయకుడు మన కేటీఆర్‌కు‌ జన్మదిన శుభాకాంక్షలు' అని సినీ నటుడు బ్రహ్మాజీ తెలిపారు. టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌ సర్‌. తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు. మీరే మాకు స్ఫూర్తి. భవిష్యత్తులోనూ మీరు రాష్ట్రం కోసం మరిన్ని మంచి పనులు చేయాలని ఆశిస్తున్నాను' అని ఈషా రెబ్బ వ్యాఖ్యానించారు.

     యువతకు స్ఫూర్తి.. దర్శకుల మాట

    యువతకు స్ఫూర్తి.. దర్శకుల మాట

    ‘యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ, రాష్ట్రం కోసం కష్టపడుతున్న కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని సినీ దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్‌ గారు. కీప్‌ రాకింగ్‌ సర్‌' అని సినీ హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ వ్యాఖ్యానించారు. ‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌ సర్‌. డైనమిక్‌ లీడర్‌. మంచి, మర్యాదలు తెలిసిన వ్యక్తి. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నా అన్న' అని సినీ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. పాలన పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తూ లక్షలాది మంది మనసులను దోచుకున్నావ్‌ బ్రదర్' అని సినీ మాటలు, కథాయిత రచయిత కోనవెంకట్‌ శుభాకాంక్షలు తెలిపారు.

    అన్నయ్యా అంటూ వంశీ..

    అన్నయ్యా అంటూ వంశీ..

    ‘నా సోదరుడు కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరెన్నో విజయాలను అందుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నయ్యా..' అని సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. ‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌. ప్రజా నాయకుడు అన్న పేరును నిలబెట్టుకోవడానికి మీరు పడుతున్న కష్టం అభినందనీయం. ఇలాగే మీరు మరెన్నో మంచి పనులు చేస్తూ ఉండాలి. సమాజానికి మీ అవసరం ఎంతో ఉంది' అని బీవీఎస్‌ రవి వ్యాఖ్యానించారు. ‘42వ పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్‌గారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

    లోకేష్ ఏమన్నారంటే..

    తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు ఈ ప్రత్యేకమైన రోజు ప్రతీక్షణం ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నానంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఇలా సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

    కేకులు కట్ చేయొద్దని కేటీఆర్

    కేకులు కట్ చేయొద్దని కేటీఆర్

    కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో భారీ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే, తన పుట్టినరోజు సందర్భంగా పోస్టర్లకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించాలని కేటీఆర్ సూచించారు. కేకులు కట్ చేసే బదులు, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

    జ్వరం అంటూ కేటీఆర్ తనదైన శైలిలో..

    జ్వరం అంటూ కేటీఆర్ తనదైన శైలిలో..

    ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్పందిస్తూ, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని కలసి పేరుపేరునా ధన్యవాదాలను చెప్పాలని ఉందని... కానీ ఆదివారం నుంచి తాను జ్వరంతో బాధపడుతున్నానని... బహుశా వయసు రీత్యా అయి ఉండవచ్చని కేటీఆర్ తనదైన శైలిలో విషయాన్ని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+