రేవంత్‌కు లీగల్ నోటీసులు జారీ చేసిన కేటీఆర్ బావమరిది పాకాల
హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి తెలంగాణ మంత్రి కే తారకరామారావు బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్(రాజ్ పాకాల) లీగల్ నోటీసులు జారీచేశారు. రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు గుప్పించారని లీగల్ నోటీసులలో ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన సన్‌బర్న్ పార్టీకిగానీ, ఇతర ఈవెంట్లతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తనకు ఎలాంటి పబ్‌లు లేవని, తనపై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులలో రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

వీడియో తీయండి
సన్‌బర్న్ సంగీత కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీయాలని ఎక్సైజ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వి భట్ ఉత్తర్వులు జారీ చేశారు. వీడియో చిత్రీకరణ చేసి తమకు అందజేయాలని ఆదేశించిన న్యాయమూర్తి విచారణను 30కి వాయిదావేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.
సన్‌బర్న్ ఈవెంట్‌కు మైనర్లను కూడా అనుమతిస్తున్నారని, ఈ కార్యక్రమంలో వారు మద్యం సేవించే ప్రమాదం ఉందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఈవెంట్‌కు వెళ్లే వారి వయసు 15 ఏళ్లు నిండాలని, మద్యం తీసుకునేందుకు 21 ఏళ్లు ఉండాలని, కార్యక్రమం మొత్తం వీడియో తీస్తామని తెలంగాణ హోం శాఖ తరఫు న్యాయవాది టి శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications