కేసీఆర్ కు హ్యాట్రిక్ దక్కేనా, అహ్మదాబాద్ తో లింకు - రేపే ఫలితం..!!

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండే అంశాలు కీలకంగా మారాయి. ఒకటి ప్రపంచ కప్ ఫీవర్. రెండోది తెలంగాణ ఎన్నికల్లో గెలుపెవరిది. ప్రపంచ కప్ ఫైనల్ లో టీం ఇండియా అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా తో తల పడుతోంది. ఈ మ్యాచ్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ పోటీ కొనసాగుతోంది. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ అహ్మదాబాద్ లోనే తేలే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఈ మెగా టోర్నీ చివరిపోరులో ఏ జట్టు టైటిల్‌ గెలుస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటు తెలంగాణలో గెలుపెవరిది అనే ఉత్కంఠ రాజకీయంగా కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ ఈ మధ్య కాలంలో కీలక వ్యాఖ్యలు చేసారు. టీమిండియా ప్రపంచ కప్ ను మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టటం ఖాయం.. ఎన్నికల్లో కేసీఆర్ మూడో సారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. అటు కాంగ్రెస్ తమదే ప్రభుత్వం అని చెప్పుకొంటోంది. కేసీఆర్, కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని గట్టిగా చెబుతున్నారు. దీంతో, ఇటు అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్స్ లో భారత్ గెలిచి విశ్వవిజేతగా నిలుస్తుందని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కానీ, తెలంగాణ ఎన్నికల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

KTR Comments on Team India win in World Cup and KCR hat trick in Elections, Now goes viral ahed Ahmedabad Final

కేటీఆర్ కోరుకున్నట్లుగా టీం ఇండియా ప్రపంచ విజేతగా హ్యాట్రిక్ సాధించాలని అందరూ కోరుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు పైనా రాజకీయంగా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. కేటీఆర్ టీం ఇండియా హ్యాట్రిక్ విజయం ఎంత ఖాయమో..కేసీఆర్ గెలుపు అంత ఖాయమని చెప్పుకొచ్చారు. దీంతో, రేపు (ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ లో టీం ఇండియా గెలిచి విశ్వ విజేతగా నిలిస్తే..కేటీఆర్ చెప్పినట్లుగా బీఆర్ఎస్ విషయంలోనూ ఇదే జరుగుతుందని చెప్పుకొనే అవకాశం ఉంటుంది. ఫలితం మరోలా ఉంటే..బీఆర్ఎస్ నేతలు ఏం చెబుతారనేది చూడాలి. అయితే, ఇప్పుడు ఈ మ్యాచ్ కు తెలంగాణ ఎన్నికలకు వాస్తవంగా ఎలాంటి సంబంధం లేకపోయినా...కేటీఆర్ ఈ రెండు పోల్చుతూ చేసిన కామెంట్స్ ను నెటిజెన్లు గుర్తు చేస్తున్నారు. దీంతో, తెలంగాణ ఫలితం కూడా అహ్మదాబాద్ లోనే తేలిపోతుందా అనే చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+