మహాత్మగాంధీతో కేటీఆర్‌ను పోల్చి.. వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో..
వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తారలు పోటెత్తారు. ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటి హేమ కూడా ఈ కార్యక్రమానికి హాజయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురించి ఓ వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియోలో మహాత్మగాంధీతో కేటీఆర్‌తో పోల్చడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన
మహాత్మ గాంధీజీ, కేటీఆర్ జీవితాలను పోల్చుతూ ఆ వీడియోను ప్రదర్శించారు. జాతీయోద్యమం సందర్భంగా దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి గాంధీజీ తిరిగి వచ్చాడు. అలాగే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుంటే అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణకు కేటీఆర్ తిరిగి వచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత
తెలంగాణ ఏర్పాటు తర్వాత తాను నిర్వహించిన ప్రతీ శాఖను అద్భుతంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించారు. మున్సిపాలిటీ శాఖ చేపట్టి నగరాలను అద్భుతంగా అభివృద్ది చేశారు. అలా ప్రతీ రంగంలోనూ తన సత్తాను కేటీఆర్ చాటారు.

తండ్రులకు వినయంగా విధేయంగా
అలాగే తెలంగాణలో జరిగిన మున్సిపాలిటీ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీని విజయపథం వైపు నడిపించారు. తండ్రి వద్ద వినయంగా విధేయంగా ఉండే వాళ్ల ఇద్దరు రామ్‌లలో ఒకరు కల్వకుంట్ల తారక రామారావు కాగా, రెండోవ్యక్తి కొణిదెల రాంచరణ్ ఈ సినిమా కార్యక్రమంలో కనిపించడం సంతోషం అని వీడియోలో చెప్పారు.

రంగస్థలం హిట్ తర్వాత
రంగస్థలం సెన్సేషనల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీను. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజ్ కానున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు చలపతి రావు, సీనియర్ హీరోయిన్ స్నేహ, క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ, ప్రవీణ, తదితరులు హాజరయ్యారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications