హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక తెలంగాణ..!!

హర్యానాలో గెలుపు పైన కాంగ్రెస్ ఆశలు ఫలించలేదు. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. జమ్ము, హర్యానా ఎన్నికల ఫలితాల పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జమ్మూ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నా ఓమర్ అబ్దుల్లా కు అభినందనలు తెలిపారు. తెలంగాణలో హామీల అమలులో వైఫల్యం హర్యానాలో కాంగ్రెస్ పైన ప్రజల్లో నమ్మకం లేకుండా చేసిందన్నారు. రాహుల్ పైన కేటీఆర్ సెటైర్లు వేసారు.

కేటీఆర్ వ్యాఖ్యలు
జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి అద్భుతమైన పునరాగమనం చేశారంటూ ఒమర్ అబ్దుల్లాకు కేటీఆర్ కితాబు ఇచ్చారు. భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నందుకు శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాహుల్ పైన సెటైరికల్ ట్వీట్ లు చేసారు. ''రాహుల్ జీ, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు ధన్యవాదములు.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు ధన్యవాదాలు చెప్పటానికి అశోక్ నగర్ యువత వేచి ఉన్నారు.. TSPSC (టీఎస్పీఎస్సీ) 5 లక్షల "యువ వికాసం" సహాయం, పునరుద్ధరణకు కూడా ధన్యవాదాలు.. మీ హామీ పూర్తయినందున యువకులను కలవడానికి తిరిగి హైదరాబాద్‌కు రావడానికి స్వాగతం'' అంటూ ట్వీట్ చేసారు.

KTR Congratulated Omar Abdhullah Satires on Rahul Gandhi goes viral

రాహుల్ పై సెటైర్లు
ఈ మేరకు రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీకి సంబంధించిన ట్వీట్‌ను ఇందులో ప్రస్తావించారు. గత ఏడాది హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌ గాంధీ.. అశోక్‌నగర్‌కు వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్దం మవుతున్న నిరుద్యోగులను కలిశారు. అనంతరం ఆయన ట్విట్టర్‌ వేదికగా అప్పటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, కేటీఆర్ హర్యానా ఎన్నికల ఫలితాల పైన స్పందించారు. కర్ణాటకలో ఐదు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌.. హరియాణలో ఏడు గ్యారెంటీలని మభ్యపెట్టే ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణ ఎఫెక్ట్
హామీల అమలులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని దేశం మొత్తం గమనిస్తోందనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్ర ఎన్నికల్లో ఒక్కో గ్యారెంటీ పెంచుకుంటూ గారడీ చేద్దామని చూసిన కాంగ్రెస్‌ బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. హరియాణలో కాంగ్రెస్‌ ఓటమితోనైనా రాహుల్‌ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలని, చెప్పేమాటలకు చేస్తున్న పనులకు పొంతన లేనప్పుడు ఇలాంటి చెంపపెట్టులాంటి ఫలితాలు తప్పవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+