ఇదేనా మీ ఇన్నోవేటివ్ థింకింగ్?: రేవంత్ సర్కారుపై కేటీఆర్ నిప్పులు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారంటీల పేరుతో అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిందంటూ మండిపడ్డారు. ఏ ఒక్క కొత్త పథకం కానీ.. ప్రాజెక్టును కానీ ప్రారంభించలేదని విమర్శించారు. ఇన్నోవేషన్ థింకింగ్ అంటే ఏంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.

'ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం. దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం. నూరు రోజులు, ఆరు గారంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా సృష్టించి, హెడ్ లైన్ మానేజ్మెంటు చెయ్యడం ఇవేనా? అంటూ కేటీఆర్ నిలదీశారు.

KTR criticized the Revanth government for not implementing the promises given

అంతేగాక, 'గత ప్రభుత్వం ఇచ్చిన 30వేల ఉద్యోగాలు మనమే ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం. గతంలో ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేదు అని చిల్లర మాటలు మాట్లాడి, ఇప్పుడు పదిహేను వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మనమే కట్టినట్టు పోజులు కొట్టడం. అర్హతలు లేని బావమరిది కంపెనీ కి వేల కోట్ల ప్రజా సొమ్ము కట్టబెట్టడం. కుటుంబపాలన అని విమర్శించి, ఇదివరకు అడ్రస్ లేని తన అన్నదమ్ముళ్లు వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని మభ్యపెట్టడం అని రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

'తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలాన్ని ఢిల్లీ బాసులకు దారాదత్తం చెయ్యడం. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, తర్వాత చేరలేదని బుకాయించడం. ఫార్మా సిటీ రద్దు అని బయట చెప్పడం, హైకోర్ట్ లో మాత్రం రద్దు చెయ్యలేదు అని న్యాయమూర్తులను కూడా మోసం చెయ్యడం, ఇష్టారీతిన పేదల ఇండ్లు కూల్చడం, బ్రదర్ ఇల్లు మాత్రం ముట్టకపోవడం
ఇంకా చాలా ఉన్నాయ్ చెప్పాలి అంటే' అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు.

మరోవైపు, నేతన్నలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు కేటీఆర్. తమ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నేతన్నకు రూ. 3312 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని, ఉపాధి కల్పనతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. సిరిసిల్లను మరో తిరుప్పూరు చేయడానికి కృషి చేశామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారని మండిపడ్డారు. బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించారని.. దానిపై విచారణ చేయాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పామన్నారు. సిరిసిల్ల నేతన్నల తరపున తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పోరాటానికి నేతన్నలు కలిసి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+