కేసీఆర్‌కు నచ్చకుంటే ఉండొద్దు, ఏబీఎన్ నిదర్శనం: రావుల
హైదరాబాద్: స్టీఫెన్ సన్ పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా, కోర్టు ధిక్కరణకు అతను పాల్పడ్డారని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు సోమవారం స్పందించారు. కేసీఆర్‌కు నచ్చని వ్యవస్థలు ఉండరాదని కోరుకుంటున్నారని, అందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియానే నిదర్శనం అన్నారు.
ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ దాఖలు చేసిన నాట్ బిఫోర్ మి పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసిందని గుర్తు చేశారు న్యాయవ్యవస్థ పైన ఆరోపణలు చేయడం దుస్సాహసమే అన్నారు. టీఆర్ఎస్ దీని పైన ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

టీఆర్ఎస్ ఆటలో స్టీఫెన్ సన్ ఓ పావు మాత్రమేనని చెప్పారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి మంత్రి కడియం శ్రీహరి రాజీనామా పైన మాట్లాడుతూ.. ఈ స్థానంలో పోటీకి బీజేపీ కోరిందన్నారు. దీనిపై తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications