తమ్ముడు లోకేష్! మీది మీరు చూసుకోలేరు కానీ: బాబుకు కెటిఆర్ చురక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, టిడిపి నేత నారా లోకేష్‌పై తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కెటిఆర్ బుధవారం ఐటి కంపెనీల సిఈఓల సమావేశంలో మాట్లాడారు.
తమ్ముడు లోకేష్ అంటూ కెటిఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేంద్రంలో తామే ఉన్నామని, నిధులు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని లోకేష్ చెబుతున్నారని.. అయితే అమరావతికి నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోయారని ప్రశ్నించారు.
ఏపీ సీఎం ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని వెళ్లారని చెప్పారు. అమరావతికి వచ్చిన ప్రధాని.. తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్లు చల్లిపోయారని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రానికి ఏం తేలేని మీరు, హైదరాబాద్‌కు ఏదో చేస్తామంటే ఇక్కడి ప్రజలు నమ్మరని అన్నారు.

హైదరాబాద్ నగరాన్ని చూసుకోవడానికి సీఎం కెసిఆర్, తాము ఉన్నామని చెప్పారు. తాము చంద్రబాబును, మిమ్మల్ని కూడా ఇక్కడ సేఫ్‌గా చూసుకుంటామని, ఇక్కడే ఉండొచ్చని కెటిఆర్ అన్నారు.
హైదరాబాద్‌లో ఐటిని తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెబుతుంటారని, ఏ ఒక వ్యక్తి వల్లో, ప్రభుత్వం వల్లో మొత్తం సాధ్యం కాదని అన్నారు. అయితే బెంగళూరు.. హైదారబాద్ కంటే ఐటిలో ఎక్కువ అభివృద్ధి సాధించిందని, దానికి ఏం కారణం చెబుతారని ప్రశ్నించారు.
చంద్రబాబు 1996-2004 వరకు సీఎంగా ఉన్నారు కాబట్టి.. ఐటి అభివృద్ధికి ఆయన కొంత సహాయం చేశారని చెప్పారు. అయితే ఆయన వల్లే ఐటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. చంద్రబాబు.. ఇంటర్నెట్‌ను కూడా తానే తయారు చేశానంటూ డబ్బా కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు ఉబెర్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థలు ఇక్కడికి వస్తున్నాయని, ఇదంతా తన వల్ల, కెసిఆర్ వల్ల కాదని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నందువల్లేనని చెప్పారు. ఐటి వాళ్లు ఓటేయరనే అభిప్రాయం ఉందని, దాన్ని తుడిచేయాలని ఐటి ఉద్యోగులకు పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను గెలిపిస్తే నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
-
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications