చిలుక మనది పలుకు పరాయిది, వాళ్ల నాయకుడు పారిపోయాడు: రేవంత్‌పై కేటీఆర్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి అబద్ధాలు చెప్పడం కొత్తేం కాదని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి అబద్ధాలు చెప్పడం కొత్తేం కాదని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు. టీడీపీ వాళ్ల నాయకుడు ఇక్కడ్నుంచి పారిపోయాడని, ఇప్పుడు వీళ్లు మాత్రం ఎగిరెగిరిపడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ తీరు చిలుక మనది పలుకు పరాయిది అన్నట్లుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

మంగళవారం హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విశ్వనగరాలు రాత్రి రాత్రే నిర్మాణం కావని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో మార్పు తీసుకొస్తామని చెప్పారు. నగరంలో 24గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో పానీపట్టు యుద్ధాలు లేకుండా చేశామని అన్నారు. స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు.

 KTR fires at Revanth Reddy and TDP

గత వర్షాకాలంలో పరిస్థితులు మళ్లీ రాకుండా చూస్తామని అన్నారు. నాలాల ఆక్రమణలు దశాబ్ధాల కాలం నుంచి ఉన్నాయని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై భారీ జరిమానాలు విధిస్తున్నామని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామని తెలిపారు.

హైదరాబాద్‌లో 90శాతం రోడ్ల మరమ్మతులు పూర్తయ్యాయని, ప్లాస్టిక్ రోడ్లతో ప్రయోగాలు చేస్తున్నామని చెప్పారు. నగరంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని చెప్పారు. శాంతిభద్రతల కోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశామని చెప్పారు.
పేకాట కబ్బులు, గుడుంబా కేంద్రాలు మూతపడ్డాయని అన్నారు. ఫొటోలకు ఫోజులిచ్చి తప్పుకోలేదని అన్నారు. విషాద నగరమని బిజెపి నేత కిషన్ రెడ్డి చెప్పడం సరికాదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+