కర్ణాటక వాల్మీకి స్కాంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వణికిపోతున్నారు: ఆ లింకేంటి? అంటూ కేటీఆర్

కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధాలున్నాయని, అందుకే ఇక్కడి నేతలకు ఆ స్కాం ముచ్చెమటలు పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కిందా మీద పడి సీఎం రేవంత్ రెడ్డి మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. విషయాలను బయటకు రాకుండా ఆపుతున్నారని ఆరోపించారు. ఆ మబ్బులు నాలుగైదు రోజుల్లో వీడిపోతాయన్నారు కేటీఆర్.

ప్రభుత్వ అకౌంట్ల నుంచి అక్రమంగా పార్లమెంట్ ఎన్నికల ముందు రూ.180 కోట్లు దారి మళ్లించారని కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య డబ్బులు దారి మళ్లించామని ఒప్పుకున్నారని తెలియజేశారు. హైదరాబాద్​‌లోని తొమ్మిది బ్యాంకు అకౌంట్లకు రూ.45 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్​‌కు ఏమైందో కానీ ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బ్యాంకు అధికారులతో పాటు 11 మందికి ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు.

KTR fires at telangana congress leaders about karnataka Valmiki Scam issue

కర్ణాటక నుంచి తెలంగాణకు చెందిన ఎవరి అకౌంట్లలోకి వచ్చాయని తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ నేతల డొంక కదులుతోందని కేటీఆర్ తెలిపారు. గత ఎన్నికల్లో ఈ డబ్బును కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఓ మీడియా సంస్థ ద్వారా బిజినెస్ అనే కంపెనీకి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని తెలిపారు. తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో బంగారం షాపులు, బార్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏమిటని, ఇవన్నీ బయటకు రావాలన్నారు కేటీఆర్.

సిద్ధరామయ్యను తొలిగిస్తే పక్కన ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి సతీష్ జార్ఖిహొలీ అంటున్నారని కేటీఆర్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్న బంధం వాల్మీకి స్కామేనా? వాల్మీకి స్కామ్​లో భారీ మొత్తంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వాటాలు వచ్చాయని తెలిసినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటోందని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరని, ఈ అంశంపై రాహుల్ గాంధీ నోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+