'భరత్ అనే నేను'కి కేటీఆర్ డబ్బులిచ్చారు.. అందుకే అలా!: రేవంత్

హైదరాబాద్: హీరో మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ ను పిలవడం వెనుక వేరే కారణం ఉందన్నారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఆ సినిమా రూపకర్తలకు కేటీఆర్ డబ్బులు ఇచ్చినందువల్లే ప్రమోషన్ కార్యక్రమాలకు ఆయన్ను పిలిచారని ఆరోపించారు.

Recommended Video

    KTR Special Interview With Bharat Anu Nenu Movie Team

    సినిమాలో హీరో పేరు 'భరత్ రామ్' అని పెట్టడానికి కేటీఆర్ ఫండింగ్ చేశారని రేవంత్ ఆరోపించారు. సినిమాలో హీరో సీఎం పాత్రలో కనిపిస్తాడు కాబట్టి.. అతని పేరులో తన పేరు కలిసివచ్చేలా చూడాలని కేటీఆర్ వారికి డబ్బులు ఇచ్చినట్టు పేర్కొన్నారు.

    ktr given money to bharath ane nenu movie team

    వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతుందని, ఆ తర్వాత కేటీఆర్ ఇక యాంకరింగ్ చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ పార్టీకి మద్దతు తెలిపిన కేసీఆర్.. ఇప్పుడు జేడీఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలో కూడా చెప్పాలని అన్నారు.

    కర్ణాటకలో ఏం జరగబోతుందో అన్నదానిపై దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోందన్నారు. కర్ణాటకలో బీజేపీ అక్రమంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+