దేశంలోనే పెద్ద అమెజాన్ క్యాంపస్‌కు కేటీఆర్ శంకుస్థాపన: 4న ఐటీ పాలసీ
హైదరాబాద్: నగరంలో అమెజాన్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్‌ను నెలకొల్పడం సంతోషకరంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. నగరంలోని వేవ్‌రాక్‌లో దేశంలోనే అతిపెద్దది, ప్రపంచంలో రెండో పెద్దదైన అమెజాన్ ఇండియా క్యాంపస్‌కు మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే అమెజాన్ పెద్ద క్యాంపస్ నిర్మిస్తోందని తెలిపారు. అమెజాన్ క్యాంపస్ 2019 వరకు పూర్తవుతుందని తెలిపారు. స్థానిక ఉత్పత్తులను అమెజాన్ విక్రయిస్తుందన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్‌ను నెలకొల్పామని గుర్తు చేశారు.

ఏప్రిల్ 4న సీఎం కేసీఆర్ ఐటీ పాలసీని ప్రకటిస్తారని చెప్పారు. నాలుగు సపరేట్ పాలసీలతో పాటు ఐటీ పాలసీని ఆవిష్కరిస్తామన్నారు. పలు పరిశ్రమల దిగ్గజాల సమక్షంలో ఐటీ పాలసీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుడైన నారాయణ మూర్తి కూడా హాజరవుతారని చెప్పారు.

ఏప్రిల్ 4న పలు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంటుందన్నారు. మేకిన్ తెలంగాణలో భాగంగా ఎలక్ర్టానిక్ పరికరాల తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఐటీని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. రూరల్ టెక్నాలజీ పాలసీని తీసుకొచ్చి గ్రామాల్లో మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌తో పాటు ఐటీఐలో నిష్ణాతులైన వారికి ఉజ్వలమైన ఉపాధి అవకాశాలను అందిస్తామన్నారు. తెలంగాణ వృద్ధిరేటు దేశ వృద్ధి రేటును అధిగమించిందని తెలిపారు. కేంద్ర సహకారం లేని కారణంగానే ఐటిఆర్ ప్రాజెక్టు నిలిచిపోయిందని చెప్పారు.
Delighted to have laid foundation stone for Amazon's largest campus outside of USA, in Hyderabad. Another milestone pic.twitter.com/j3i2aFqBjc
— KTR (@KTRTRS) March 30, 2016
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications