హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌ని మించిన గ్లామరా: పవన్ కళ్యాణ్‌పై కెటిఆర్! రాజీనామా చేస్తానని షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు తమ పార్టీకి సినీ తారల గ్లామర్ అవసరం లేదని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం నాడు అన్నారు. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు.

గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఓడితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, మరి వారి పార్టీలు ఓడితే విపక్ష నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. తమకు విజయం సాధించేందుకు సినిమా గ్లామర్ అవసరం లేదన్నారు.

KTR indirect comments on Pawan Kalyan

తమ పార్టీకి గ్లామర్ అద్దేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావేనని, అలాంటి వ్యక్తిని మించిన గ్లామర్ లేదన్నారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన కలలో కూడా లేదన్నారు. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ ఉండగా, ముఖ్యమంత్రి పదవికి మరెవరూ అర్హులు కాదని భావిస్తున్నానని చెప్పారు.

తమ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు పూర్తి చేసేందుకు ఐదేళ్ల సమయం సరిపోదని, ఐదు నుంచి పదేళ్ల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ పూర్తి చేస్తామన్నారు. హైదరాబాదులో పాతబస్తీ వెనకబాటుతనానికి మజ్లిస్ పార్టీ మాత్రమే కారణం కాదన్నారు. ఆ పార్టీ కొంత కారణమన్నారు.

బిజెపి అంటే భారతీయ జోక్ పార్టీ అని ఎద్దేవా చేశారు. విభజన జరగకుంటే ఏపీలో ఇంత అభివృద్ధి జరిగేదా అని ప్రశ్నించారు. హైదరాబాదులో అన్ని ప్రాంతాల వారు వెనుకబడిన ఉన్నారన్నారు. మేం కచ్చితంగా వంద సీట్లు గెలుచుకుంటామన్నారు.

English summary
Minister KT Rama Rao indirect comments on Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X