ఆయనకు అంత సీన్ లేదు!:అమిత్ షా పైన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణాకు వచ్చి వారి పార్టీని నిలబెట్టేంత గొప్ప నాయకుడు అమిత్ షా అని తాను అనుకోనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 2వ తేదీన ఎంతో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవానికి ప్రాముఖ్యత లేదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో సెప్టెంబర్ 17కు ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఇప్పుడు దానికి లేదన్నారు. ఈ విషయమై బిజెపి అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. అయితే, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఎవరైనా నిర్వహించుకోవచ్చునని చెప్పారు. అమిత్ షా గుజరాత్ లో తమ పార్టీని ముందు గెలిపించుకోవాలని, ఆ తర్వాతే తెలంగాణలో ఆ పార్టీని బలోపేతం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications