డైనమిక్: కేటీఆర్‌ను ఆకాశానికెత్తిన మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం నాడు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన ప్రశంసల వర్షం కురిపించారు. కేటీఆర్ డైనమిక్ లీడర్ అని, డైనమిక్ మంత్రి అని కొనియాడారు. హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని భారతీ నగర్ డివిజన్, భెల్ ఎంఐజీ కాలనీల్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. కేటీఆర్ దేశ, విదేశాల్లో పర్యటిస్తూ ఐీ, పారిశ్రామిక రంగాలతో పాటు ఇతర రంగాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారన్నారు.

కేటీఆర్ ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నారన్నారు. నగరాన్ని దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. వివిధ దేశాల్లోని అభివృద్ధిని పరిశీలిస్తున్నారన్నారు. హైదరాబాదులో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారని, నగరాభివృద్ధికి ప్రజలు కూడా సహకారాన్ని అందించాలని కోరారు.

KTR is dynamic leader: Harish rao

ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో గోదావరి జలాలని నగరానికి రప్పించడంతో వేసవిలో మంచినీటి సమస్యను అధిగమించామన్నారు. ఇదిలా ఉండగా, మంత్రి కేటీఆర్ పైన హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించడం ఆసక్తిని రేపుతోంది.

ఇద్దరు పరస్పరం గతంలోను పొగడుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ... తెరాసలో వారసత్వ పోరు హరీష్, కేటీఆర్ మధ్య ఉండవచ్చుననే వాదనలు వినిపించాయి.

అదే సమయంలో కేటీఆర్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు, సిద్దిపేట ఎన్నికల్లో తెరాసకు కొంత చేదు అనుభవం ఎదురు కావడం, హరీష్ రావు శాఖను ఇటీవలే కెటిఆర్‌కు ఒకదానిని ఇచ్చిన నేపథ్యంలో.. ఈ పొగడ్తలు ఆసక్తిని రేపుతున్నాయి. పొగడ్తల విషయాన్ని పక్కన పెడితే ప్రధానంగా డైనమిక్ లీడర్ అని చెప్పడం గమనార్హం.

హరీష్ రావుతో డీకే అరుణ భేటీ

మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ శనివారం నాడు మంత్రి హరీష్ రావును కలిశారు. జూరాల ప్రాజెక్టు ముంపు బాధితులతో కలిసి ఆమె సచివాలయంలో హరీష్ రావును కలిశారు. థరూర్ మండలం నాగర్ దొడ్డిలోని 276 కుటుంబాలకు పరిహారం మంజూరు కాకపోవడం, పునరావాసం అందకపోవడాన్ని ఆమె మంత్రి దృష్టికి తీసుకు రాగా, సాయమందిస్తామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+