స్పెషల్ అట్రాక్షన్: కేటీఆర్ లేకుండా ‘మెట్రో’ రిబ్బన్ కట్ చేయని మోడీ(వీడియో)

తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావుకు ఈ మంగళవారం చాలా ప్రత్యేకంగా నిలిచింది.

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావుకు ఈ మంగళవారం చాలా ప్రత్యేకంగా నిలిచింది. హైదరాబాద్‌లో ఒక వైపు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం, మరో వైపు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుల నేపథ్యంలో ఆయన ఈ రోజు చాలా బిజీగా గడిపారు.

కాగా, మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలవడం గమనార్హం. కేటీ రామారావు తనకు ఈ మంగళవారం ఎంతో ప్రాతిష్ఠాత్మక రోజని ఇంతకుముందే చెప్పారు. ఈ రోజు చాలా బిజీగా ఉండాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు.

 కేటీఆర్‌కు మోడీ ప్రాధాన్యత

కేటీఆర్‌కు మోడీ ప్రాధాన్యత

ఇది ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ.. మంత్రి కేటీ రామారావుకు అమితమైన ప్రాధాన్యత ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మెట్రో రైలు ప్రారంభోత్సవంలో కేటీఆర్ తన పక్కనే ఉండేలా మోడీ చూసుకోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద చోటు చేసుకున్న ఆసక్తికర ఘటన అందర్నీ ఆకట్టుకుంది.

కేటీఆర్ రాకుండా రిబ్బన్ కట్ చేయని మోడీ

మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా.. మంత్రి కేటీఆర్ లేకుండా ప్రధాని మోదీ రిబ్బన్ కట్ చేయకపోవడం గమనార్హం. రెండు మూడు క్షణాల పాటు ఆగిన మోడీ.. కేటీఆర్ కోసం చూశారు. మోడీకి కుడివైపున ఉన్న కేటీఆర్‌ను గుర్తించి.. తన వద్దకు పిలిపించుకుని రిబ్బన్ కట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి.

మోడీ పక్కనే కేటీఆర్

మెట్రో ప్రారంభోత్సవం అనంతరం మోడీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేటీఆర్ కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. రైలులో కూడా మోడీ తన పక్కనే కేటీఆర్‌ను కూర్చోబెట్టుకోవడం గమనార్హం.

 ఉల్లాసంగా మోడీ, కేటీఆర్..

ఉల్లాసంగా మోడీ, కేటీఆర్..

కాగా, మోడీకి మరోవైపు గవర్నర్ నరసింహన్ ఉండగా... ఆయన పక్కన సీఎం కేసీఆర్ కూర్చున్నారు. రైల్లో మోడీ చాలా హుషారుగా గడిపారు. కేటీఆర్‌తో మాట్లాడుతూ ఉల్లాసంగా కనిపించారు. అధికారులతో కూడా ముచ్చటించారు. మెట్రో రైలు నుంచే ప్రజలకు అభివాదం చేశారు మోడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+