ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు..!!
రాష్ట్ర ప్రభుత్వం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రైతు రుణమాఫీ అంశంలో రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతులు తాను రైతు అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన కేటీఆర్ చేసిన ట్వీట్ లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. సుదీర్ఘంగా చేసిన పోస్టులో రైతు రుణమాఫీ పై ప్రభుత్వ తాజా నిర్ణయాలను ప్రశ్నించారు.
సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో రైతులను అవమానిస్తున్న రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే.. మీరు అనుమానిస్తూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని, ఇచ్చేది పక్కన బెట్టి వాపస్ దృష్టి సారించారని విమర్శించారు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు పెడుతున్నారన్నారు. సెల్ఫీ దిగి నేను రైతునని రైతు నిరూపించుకోవాలా అని ప్రశ్నించారు.

ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు రుణమాఫీ చెయ్యలేక రేవంత్ సర్కార్ నయా డ్రామా షురూ చేసిందన్నారు. మొన్న ఖమ్మంలో పింఛన్ వాపస్.. ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ ఆప్షన్ అంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టు పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేటీఆర్ తన పోస్టులో.. 'మాఫీకానీ రుణమాఫీ.. రైతులను అనుమానిస్తున్న రేవంత్ సర్కార్. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతొ కొత్త డ్రామా.. ఇచ్చేది పక్కన బెట్టి వాపస్‌పై దృష్టి. మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్.. ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ ఆప్షన్. కేసీఆర్ రైతు రాజును రాజు చేస్తే.. మీరు అనుమానిస్తూ వేధిస్తున్నారు.
మాఫీకానీ రుణమాఫీ-రైతులను అనుమానిస్తున్న రేవంత్ సర్కార్
— KTR (@KTRBRS) August 29, 2024
సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతొ కొత్త డ్రామా-ఇచ్చేది పక్కన భేట్టి వాపస్ పై ద్రుష్టి
మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్-ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ అప్షన్
కేసీఆర్ గారు రైతు రాజును రాజు చేస్తే-మీరు అనుమానిస్తూ వేధిస్తున్నారు… pic.twitter.com/A9TN7elLws
దీనికి కొనసాగింపుగా ..ఇప్పటికే మాఫీపై మంత్రులు, ముఖ్యమంత్రి జూటా మాటలు అసత్య ప్రచారాలు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు.. సెల్ఫీ దిగి నేను రైతును అని రైతు నిరూపించుకోవాలా?. ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు రుణమాఫీ చెయ్యలేక రేవంత్ సర్కార్ నయా డ్రామా షురూ. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన' అంటూ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications