ఎన్టీఆర్ చేయలేనిది కేసీఆర్ చేస్తారు, ఆ పేరులోనే పవర్ - కేటీఆర్..!!

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే..తెలంగాణ వారి పౌరుషం కేసీఆర్ చాటారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆరాధించే నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాముడు, క్రిష్ణుడు ఎలా ఉంటారో తెలియదని..ఎన్టీఆర్ ను చూడగానే వాళ్లు ఆయనే అనేలా చెరగని ముద్ర వేస వేసారని కీర్తించారు. భారత దేశంలో తెలుగు వారు ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు.

మంత్రి కేటీఆర్ ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ పై రూ 1.37 కోట్లతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆశిష్కరించారు. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్న ప్రజల గుండెల్లో మాత్రం ఎన్టీఆర్ ఎప్పటికీ నిలిచిపోతారని చెప్పుకొచ్చారు. తెలుగు వారి ఖ్యాతి ఎన్టీఆర్ చాటితే..తెలంగాణ వారి అస్తిత్తవం..పాలనా సామర్ధ్యవం..వారి పౌరుషాన్ని కేసీఆర్ చాటారని కేటీఆర్ వివరించారు. కొందరవకి పదవులు వన్నె తెస్తే...మరి కొందరు పదవులకే వన్నె తెచ్చారని ప్రశంసించారు. ఎన్టీఆర్ కు సీఎం పదవి చాలా చిన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన ఎన్నో శిఖరాలను అధిరోహించారని వివరించారు.

KTR lauds NTR ahead of elections,says magical power in the name

తారక రామారావు అనే పేరులోనే పవర్ ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఇదే పేరు ఉన్న తన మిత్రుడు చెప్పారంటూ పరోక్షంగా జూ ఎన్టీఆర్ ను కేటీఆర్ ను ప్రస్తావించినట్లు కనిపిస్తోంది.తనకు ఆ పేరు ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఆ పేరు తనతో ఉన్న కారణంగానే రెండు సార్లు మంత్రి అయ్యానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కాలేకపోయారని..దక్షిణ భారత దేశంలో మరెవరికీ వరుసగా మూడు సార్లు సీఎం అయ్యే ఛాన్స్ దక్కలేదన్నారు. కేసీఆర్ మాత్రం మూడో సారి సీఎం అయి హ్యాట్రిక్ సాధించి..ఎన్టీఆర్ చేయలేనిది ఆయన శిష్యుడిగా చేసి చూపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు.

కొద్ది రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ కు హైదరాబాద్ లో అనుమతుల విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులతో పాటుగా ఖమ్మంలోనూ ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో కేటీఆర్ ఖమ్మం వేదికగా ఇప్పుడు ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+