ఇప్పుడు ఉంది అసలు ఆట - రేవంత్ కు కేటీఆర్ అల్టిమేటం..!!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు పైన స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలవిగానీ హామీలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆయన్ను తామెందుకు వదిలిపెడతామన్నారు. తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. వారు చూసుకోక పోతే తమకేం సంబంధమని కేటీఆర్ పేర్కొన్నారు.

కేటీఆర్ కామెంట్స్ : సీఎం రేవంత్ ను గ్యారంటీల అమలులో వదిలేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలో కాంగ్రెస్ నిర్ణయానికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇదే సందర్భంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ ఇచ్చిన ప్రతీ హామీకి.. చెప్పిన ప్రతీ మాటకు రికార్డ్ ఉందన్నారు. ఆయన్ను తామెందుకు వదిలిపెడతామన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని.. రాగానే పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారని.. పదిరోజులు ఆగండి 15వేలు రైతు భరోసా ఇస్తాం అన్నారని.. కాని ఇంకా ఇవ్వలేదని విమర్శించారు. మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తాం అన్నారు ఏమైందని ప్రశ్నించారు.

KTR made serious comments over Congress guanrantees implmentation in Revanth Govt

మభ్య పెట్టారు : రుణ మాఫీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో తమకు తెలుసన్నారు. ఎలా చేస్తారో తాము కూడా చూస్తామన్నారు. ఎవరైనా అధికారంలోకి రాక ముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని.. కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారన్నారు. తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. వారు చూసుకోక పోతే తమకేం సంబంధమని కేటీఆర్ పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదన్నారు. ప్రతి ఏడాది పీ ఏ సీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామని గుర్తు చేసారు. తాము మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని చెప్పుకొచ్చారు. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని వ్యాఖ్యానించారు.

KTR made serious comments over Congress guanrantees implmentation in Revanth Govt

వదిలేదు లేదు: రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారని కేటీఆర్ వివరించారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడని చెప్పుకొచ్చారు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడన్నారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని..ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్స్ పైన ప్రభుత్వంలోని మంత్రులు..కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+