'అమెజాన్' ఆన్‌లైన్లో టీ ఉత్పత్తులు: కేటీఆర్‌కు హామీ
హైదరాబాద్: ప్రముఖ ఆన్‌లైన్ అమ్మకాల సంస్థ అమెజాన్ ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం సమావేశమయ్యారు. హైదరాబాదులో భారీ గోడౌన్‌ను అమెజాన్ సంస్థ ఏర్పాటు చేయనుంది. అమెజాన్ తన ఆన్ లైన్ వ్యాపారం ద్వారా తెలంగాణ హస్తకళలను ప్రోత్సహించాలని కేటీఆర్ కోరారు.
తెలంగాణ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు, నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరలను మార్కెటింగ్ చేస్తామని అమెజాన్ బృందం కేటీఆర్‌కు తెలిపింది. ఈ మేరకు అమెజాన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో ఒప్పందం చేసుకోనుంది.
పాలమూరుకు రూ.325 కోట్లు: హరీశ్ రావు

మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగులో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.325 కోట్లను కేటాయించినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగడ దగ్గర కేఎల్‌ఐ సెకండ్ లిఫ్ట్‌ను మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిలతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పనులను మంత్రి సమీక్షించారు.
పిచ్చిపనులు మానుకోవాలి: తమ్మినేని
వాస్తు పేరుతో సచివాలయం తరలింపు లాంటి పిచ్చిపనులు మానుకోవాలని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని సీతారామ్ బుధవారం అన్నారు. వాస్తు పేరుతో సచివాలయం తరలిస్తామని కోర్టుకు చెప్పగలరా? అన్నారు. చెస్ట్ ఆస్పత్రి తరలించమంటే పేదలకు ద్రోహం చేయడమే అన్నారు. చెస్ట్ ఆసుపత్రి తరలింపుపై అసెంబ్లీలో చర్చిస్తారా అని నిలదీశారు. వాస్తును నమ్మి ఆసుపత్రిని తరలించడమేమిటని చాడ అన్నారు.












Click it and Unblock the Notifications