పెట్టుబడులతో రండి: అమెరికాలో కేటీఆర్ బిజీబిజీ(పిక్చర్స్)

న్యూయార్క్: తెలంగాణలో భారీయెత్తున ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఐటీ, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు అమెరికాలోని పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్.. యునైటెడ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఎజెన్సీ ప్రతినిధుల బృందంతో గురువారం సమావేశం అయ్యారు.

బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మార్క్ అలెన్‌తో..

బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మార్క్ అలెన్‌తో..

హైదరాబాద్‌లో బోయింగ్‌ సంస్థకు మంచి సహకారం అందుతుందని ఆ సంస్థ అధ్యక్షుడు మార్క్‌ అలెన్‌ అభినందించారు.

మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలోని పరిశ్రమల ప్రతినిధుల్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని సదస్సు డైరెక్టర్‌ టామ్‌ లెర్సస్టెన్‌ను కోరారు. దీనికి హైదరాబాద్‌ అత్యుత్తమ కేంద్రమని, సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా తొలిరోజు (బుధవారం) మంత్రి వాషింగ్టన్‌లో గడిపారు.

క్లీవ్‌లాండ్‌లో..

క్లీవ్‌లాండ్‌లో..

కాలుష్యాన్ని తగ్గిస్తూ, అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలను అందిపుచ్చుకుని, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోయేందుకు అనుసరించాల్సిన ప్రణాళిక గురించి మాట్లాడారు. నగరంలోని ఫార్మా కంపెనీలను ఔటర్ రింగ్‌రోడ్డు అవతల ఉన్న ఫార్మా సిటీకి తరలించేందుకు తీసుకుంటున్న చర్యలను సమావేశంలో మంత్రి ప్రస్తావించారు.

యూఎస్ఐబీసీ ఈవెంట్

యూఎస్ఐబీసీ ఈవెంట్

ఈ అంశంలో మార్గదర్శకాల రూపకల్పనలో ప్రభుత్వానికి సహకరించేందుకు అమెరికాలోని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ముందుకు వచ్చింది. ఫైజర్, ఏలీ లీలీ, అలెక్సియన్, మెర్క్, అమ్జెన్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కెటిఆర్ తెలంగాణలో ఫార్మా రంగానికి ఉన్న అవకాశాల గురించి వివరించారు.

 కేథరిన్ బి హడ్డాతో..

కేథరిన్ బి హడ్డాతో..

ఈ సందర్భంగా క్లీవ్‌లాండ్ మోటార్ సైకిల్ వర్క్ కంపెనీతో కెటిఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని కంపెనీ సిఇఓ జొనాథన్‌ను కోరారు. కమ్యూని క్లిక్ సంస్థకు చెందిన రామ్‌రెడ్డితోనూ మంత్రి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో తమ సంస్థ విభాగాన్ని ప్రారంభించేందుకు రాంరెడ్డి ముందుకు వచ్చారు.

ఫార్మా ప్రతినిధులతో..

ఫార్మా ప్రతినిధులతో..

గ్లోబల్ ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్ సమ్మిట్ 2017 నిర్వాహకులు డైరెక్టర్ టామ్ లెర్సస్టెస్‌తో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కెటిఆర్ తెలిపారు.

వరుస భేటీలు

వరుస భేటీలు

అమెరికాలోని తాత్కాలిక భారత రాయబారి తరణ్‌జీత్‌సింగ్ సంధు, హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్‌గా నియమితులైన కథెరినే బి హడ్డా, బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మార్క్ అలెన్‌లతోనూ మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. ఎయిరోస్పేస్‌ రంగంలో విద్యార్థులు, యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఇరువురూ చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+