జైట్లీ జీ! మా సొమ్ము మాకే, పవన్ కళ్యాణ్ ఇష్టం: కేటీఆర్ (ఫోటోలు)
హైదరాబాద్: ఏపీ బెవరేజెస్ పన్ను బకాయిల పేరుతో ఎలాంటి నోటీసులు లేకుండా తెలంగాణ ఖాతా నుంచి ఆర్బీఐ తీసుకున్న నిధులు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు శనివారం విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో బకాయిలు ఉండగా తెలంగాణ బెవరేజెస్ నుంచి రూ.1274.21 కోట్లు ఆర్బీఐ తీసుకుందని, ఏపీ నుంచి మాత్రం తీసుకోలేదని జైట్లీ దృష్టికి తీసుకు వెళ్లారు. తెలంగాణ ఏఱ్పడినప్పుడే టీఎస్ బెవరేజెస్ ఏర్పడిందని, సదరు సొమ్ములు తిరిగి ఇప్పించాలని లేకుంటే సంస్థ రోజువారీ నిర్వహణకు ఇబ్బందులన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం పైన ఇరువురు చర్చించారు. జైట్లీతో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఓటుకు నోటు నుచి తప్పించుకునేందుకు 5 కోట్ల ఆంధ్రప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

కేటీఆర్ - జైట్లీ
ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ సందర్భంగా చెప్పారు.

కేటీఆర్ - జైట్లీ
రాజ్యాంగ సవరణ లేకుండా సెక్షన్ 8 చెల్లదని జైట్లీ గతంలోనే చెప్పారని కేటీఆర్ తెలిపారు. కేంద్రం కొత్తగా న్యాయపరమైన చిక్కులు తెచ్చుకుంటుందని తాను భావించడం లేదన్నారు.

కేటీఆర్ - జైట్లీ
హైదరాబాదులో అంతా ప్రశాంతంగానే ఉందని, రెండు రాష్ట్రాల మధ్యసామరస్య వాతావరణం ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. జైట్లీని కలిసిన వారిలో సీఎస్ రాజీవ్ శర్మ, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు తదితరులు ఉన్నారు.

కేటీఆర్
రెండు రోజుల క్రితం ఆస్క్ కేటీఆర్ లైవ్ ట్విట్టర్‌లో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఓ ప్రశ్నకు సమాధానంగా... సినీ నటుడిగా తనకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని చెప్పారు.

కేటీఆర్
రెండు రోజుల క్రితం ఆస్క్ కేటీఆర్ లైవ్ ట్విట్టర్‌లో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఓ ప్రశ్నకు సమాధానంగా... తాను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే అమెరికాలో ఉండేవాడినని చెప్పారు.

కేటీఆర్
తనకు క్రికెట్లో రాహుల్ ద్రావిడ్, సినీ తారల్లో షారుక్ ఖాన్ అంటే ఇష్టమని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను నటుడిగా అభిమానిస్తానని చెప్పారు.

కేటీఆర్
రెండు రోజుల క్రితం ఆస్క్ కేటీఆర్ లైవ్ ట్విట్టర్‌లో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఓ ప్రశ్నకు సమాధానంగా... సినీ నటుడిగా తనకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని చెప్పారు.












Click it and Unblock the Notifications