చాలాకాలం తర్వాత తీహార్ జైల్లో కవితను కలిసిన కేటీఆర్.. ఏం మాట్లాడుకున్నారు?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ ఆరోపణలను, సిబిఐ అవినీతి ఆరోపణలను, విచారణను ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈడి కవితను అరెస్టు చేసిన నాటినుండి న్యాయస్థానాల వేదికగా ఈ కేసు నుంచి బయటకు రావడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్న కవిత ఈ కేసులో పీకల్లోతు కష్టాలలో కూరుకు పోయారు.

కవిత కు నో బెయిల్... శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న కుటుంబం
ఇప్పటివరకు బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం కవిత కుటుంబం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఆ ప్రయత్నాలకు దర్యాప్తుసంస్థలు బ్రేకులు వేస్తూనే ఉన్నాయి. కవిత బెయిల్ కోసం ఎప్పుడు కవిత తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, ఈడి, సిబిఐ కవిత కేసులో కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చి ఆమెకు బెయిల్ ఇవ్వద్దని బలంగా వాదిస్తున్నాయి.

KTR met Kavitha in Tihar Jail What did they talk about

మ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు కేటీఆర్ ములాఖత్
ఇదిలా ఉంటే కవిత జైలుకు వెళ్లిన తొలి నాళ్లలో కవిత కేసుపైననే ఎక్కువ ఫోకస్ చేసిన మాజీ మంత్రి ,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కవితను కలిసేందుకు వెళ్లలేదు. మళ్ళీ ఇంత కాలానికి నేడు తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కవిత ఆరోగ్యాన్ని గురించి వాకబు చేశారు.

ధైర్యంగా ఉండాలని చెప్పిన కేటీఆర్
కేసు నుండి బయటకు తీసుకురావడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నామని, ధైర్యంగా ఉండాలని కవితకు మనోధైర్యాన్ని ఇచ్చి తిరిగి హైదరాబాదుకు ప్రయాణమయ్యారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు జులై మూడవ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించారు. అంతే కాదు సిబిఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కవిత రిమాండ్ పొడిగిస్తూ పోతున్న రౌస్ అవెన్యూ కోర్టు
సిబిఐ కేసులో రిమాండ్ ను పొడిగించినట్టు సిబిఐ ప్రత్యేక కోర్టు గత విచారణ సమయంలో వెల్లడించింది. మద్యంకేసులో కవిత పాత్రపై సిబీఐ సప్లమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మళ్లీ కవిత కేసులో విచారణను, జూలై ఆరవ తేదీన చేపడతామని సిబిఐ స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. జైల్లో చదువుకోవడానికి కొత్తగా తొమ్మిది పుస్తకాలు కావాలని కవిత అడగగా ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూకోర్టు అందుకు అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+