రోల్ మోడల్స్: నేనూ అదే ఫీలవుతున్నా!: కేటీఆర్‌ను ‘బ్రదర్’ అంటూ నాని
హైదరాబాద్: వారిద్దరూ తమ తమ రంగాల్లో ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. అంతేగాక, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని. వీరిద్దరి గురించి ఇప్పుడెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. దానికి ఓ కారణం కూడా ఉంది.

రోల్ మోడల్స్ కేటీఆర్, నాని
ఓ యువకుడు తన ఎదురుగా కూర్చుకున్న విద్యార్థులకు తన రోల్ మోడల్స్ గురించి ప్రస్తావించాడు. ఈ సందర్భంగా ప్రాజెక్టర్‌పై కేటీఆర్, నాని ఫొటోలను ప్రదర్శించి వారే తన రోల్ రోల్ మోడల్స్ అంటూ వివరించాడు.

సంతోషంగా ఉందంటూ.. కేటీఆర్‌కు
కాగా, ఈ ఫొటోను హేమంత్ అనే నెటిజన్ ఒకరు మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఒక రాజకీయ నాయకుడు విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం చాలా సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యనించాడు.

వావ్.. నాని మంచి కంపెనీ ఇచ్చారు..
ఈ ఫొటోను చూసిన కేటీఆర్ వెంటనే స్పందించారు. ‘వావ్ ఇది ఎక్కడ జరిగిందో కానీ.. నాకు చాలా నచ్చింది. పక్కనే నాని కూడా మంచి కంపెనీ ఇచ్చారు' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

కేటీఆర్‌ను బ్రదర్ అంటూ నాని ట్వీట్
కాగా, కేటీఆర్ ట్వీట్‌కి నాని కూడా స్పందించారు. ‘నేనూ అదే ఫీలవుతున్నా బ్రదర్. ఈ ఫొటోను చూడగానే చిరునవ్వులు విరిశాయి. థాంక్యూ' అంటూ నాని వ్యాఖ్యానించారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications