తండ్రి అయ్యాకే తెలిసింది: కేటీఆర్-లోకేష్‌లది ఒకేమాట!
హైదరాబాద్: ఆదివారం నాడు ఫాదర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు స్పందించారు. మా తండ్రి మమ్మల్ని ఎంతో తీర్చిదిద్దారని ఇద్దరు తమ తమ తండ్రుల గురించి చెప్పారు.
తన తండ్రి చంద్రబాబు తన మీద కురిపించిన ప్రేమ ఎంతటిదో తాను తండ్రిని అయ్యాక అర్థమవుతోందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్‌తో తీయించుకున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

తన తండ్రి బాధ్యతలతో ఎంతో ఒత్తిడితో ఉండేవారని, అయినా అనుక్షణం తనతో ఉన్నట్లే ఉండేదని చెప్పారు. నా ప్రపంచాన్ని తన తండ్రి ఎంతో తీర్చిదిద్దారని లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. దేవాన్షన్ నవ్వుల మోముతో ఫాదర్స్ డే వేడుక చేసుకున్నామన్నారు.
కేటీఆర్ ట్విట్టర్లో... తాను తండ్రి కేసీఆర్ అయ్యాక గాని తన తండ్రి తమకోసం చేసిన త్యాగాలు తెలిసిరాలేదని పేర్కొన్నారు. 'నా తండ్రి కేసీఆర్ నా కోసం చేసిన త్యాగాలు నేను నాన్న అయ్యాక తెలిశాయి' అని కేటీఆర్ రాశారు.
ట్వీట్‌తో పాటు రెండు ఫోటోలను కూడా పెట్టారు. టోపీ, కళ్లద్దాలు పెట్టుకున్న తన కొడుకు, కూతురుతో కలిసి టోపీ మాత్రమే పెట్టుకున్న తన తండ్రి ఫొటోను పోస్ట్ చేశారు. తనను తన తండ్రి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మరో ఫొటోను కూడా ఉంచారు.












Click it and Unblock the Notifications