• search

నిజమైన ‘నాయకన్’: కమల్ ఆహ్వానంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
      Kamal Haasan Party Launch : KTR Calls Kamal As 'Nayakan'

      హైదరాబాద్: తమిళనాట రాజకీయ అరంగేట్రం చేస్తున్న ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు అభినందనలు తెలిపారు. బుధవారం కమల్ హాసన్ తన పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.

      కమల్ రాజకీయ పార్టీని ప్రకటిస్తున్న సందర్భంగా బుధవారం సాయంత్రం మదురైలో నిర్వహించబోతున్న సభకు తనను కూడా ఆహ్వానించారని కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

      కమల్‌కి ధన్యవాదాలు

      ‘రాజకీయాల్లో ప్రవేశిస్తున్న సందర్భంగా మదురైలో నిర్వహిస్తున్న సభకు నన్ను కూడా పిలిచినందుకు కమల్ హాసన్‌జీకి ధన్యవాదాలు. భౌతికంగా నేను ఈ కార్యక్రామానికి రాలేపోతున్నాను' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

       నిజమైన ‘నాయకన్'

      నిజమైన ‘నాయకన్'

      ‘కమల్ నూతన ప్రస్థానం విజయవం కావాలని ఆశిస్తున్నాను. నిజ జీవితంలోనూ ‘నాయకన్'గా మీరు(కమల్) బాగా రాణించాలని కోరుకుంటున్నాను' అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

      కమల్ రాజకీయ యాత్ర

      కమల్ రాజకీయ యాత్ర

      కాగా, కమల్ తన మదురై సభకు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలువురు నేతలను ఆహ్వానించారు. ఈ సభలో కమల్ తన రాజకీయ పార్టీ పేరును, గుర్తును ప్రకటించనున్నారు. బుధవారం కమల్ హాసన్ తన రాజకీయ యాత్రను ప్రారంభించారు.

       భారీగా చేరుకున్న అభిమానులు

      భారీగా చేరుకున్న అభిమానులు

      బుధవారం ఉదయం చెన్నై నుంచి రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటికి వెళ్లారు. అనంతరం మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కమల్ తన రాజకీయ యాత్రను కొనసాగించారు. కమల్ చేపట్టిన యాత్రకు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.

      తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

      English summary
      Telangana minister KTR responded on Cine Hero Kamal Haasan invitation to his political meeting held in madurai on Wednesday.

      Oneindia బ్రేకింగ్ న్యూస్
      రోజంతా తాజా వార్తలను పొందండి

      X
      We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more