డిజాస్టర్ టూరిజం సరికాదు, అండగా ఉంటాం: రోహిత్ ఆత్మహత్యపై కెటిఆర్ స్పందన
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై మంత్రి కెటిఆర్ శనివారం స్పందించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన దురదృకరమని అన్నారు. తమ పార్టీ తరపున ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్ ఇప్పటికే స్పందించారని తెలిపారు.

విద్యాలయాల్లో రాజకీయాలు ఎక్కువ కావడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు. ఉద్వేగ భరిత వాతావరణం కలిగించే పనులు చేయమని అన్నారు. డిజాస్టర్ టూరిజం సరికాదని, రాజకీయం చేయడం తగదని అన్నారు.
రోహిత్ ఆత్మహత్యను తాము రాజకీయం చేయమని, అతని కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మంత్రి కెటిఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications