కేటీఆర్ అసలు పేరు వేరే.. అంతటి దౌర్భాగ్యుడు కేసీఆర్: రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే టికెట్‌కు కక్కుర్తిపడి కొడుకు పేరు మార్చుకున్నాడని కేసీఆర్‌ను రేవంత్ విమర్శించారు.కేటిఆర్ అసలు పేరు అజయ్ అని తెలిపారు.అప్పట్లో ఎన్టీఆర్ టికెట్ ఇస్తాడో.. ఇవ్వడో అన్న భయంతో కేసీఆర్ తన కొడుకు
హైదరాబాద్: జేఏసీ ఛైర్మన్ కోదండారాంపై కేసీఆర్ తిట్ల దండకం.. ఆయన వ్యతిరేకులకు ఓ అస్త్రాన్ని ఇచ్చినట్లయింది. ఛాన్స్ దొరికితే కేసీఆర్‌పై విరుచుకుపడే టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహజంగానే మళ్లీ రెచ్చిపోయారు.
కేసీఆర్ కన్నా రెట్టింపు తిట్ల దండకంతో రేవంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. పనిలో పనిగా.. కేటీఆర్ అసలు పేరు వేరే ఉందని ఓ కొత్త విషయం చెప్పుకొచ్చాడు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఎమ్మెల్యే టికెట్‌కు కక్కుర్తిపడి కొడుకు పేరు మార్చుకున్నాడని కేసీఆర్‌ను రేవంత్ విమర్శించారు.

కేటిఆర్ అసలు పేరు అజయ్ అని, అప్పట్లో తనకు ఎన్టీఆర్ టికెట్ ఇస్తాడో.. ఇవ్వడో అన్న భయంతో కేసీఆర్ కొడుకు పేరును తారకరామారావు అని మార్చాడని ఎద్దేవా చేశారు. అజయ్ పేరును కేటిఆర్‌గా మార్చిన దౌర్భాగ్యుడు కేసిఆర్ అని విమర్శించారు.
నాడు అజయ్ పేరును కేటీఆర్ గా మార్చిన కేసీఆర్.. నేడు కొడుకును సీఎం చేయడం కోసం కొత్త సచివాలయం కట్టించాలనే ఆరాటంలో ఉన్నారని విమర్శించారు. ఎవడో జాతకాలు చెప్పేటోని మాటలు విని.. ఉన్న సచివాలయం కూలగొట్టి కొత్తది కడుతా అని సిఎం ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటన్నారు.
ఇప్పటివరకు 16 మంది సిఎంల కొడుకులెవరూ సిఎం కాలేదని, ఈసారి తన కొడుకును సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రయత్నానికి సచివాలయం వాస్తు దోషం అడ్డుగా ఉందని, అందుకే కొత్తగా కట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఇదంతా కేసీఆర్ మూర్ఖత్వం కాదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications