కొత్త పంథా: పెళ్లి చూపులు సినిమా కెటిఆర్‌కు భలే నచ్చేసింది

హైదరాబాద్: అంచనాలేవీ లేకుండా విడుదలై విజయవంతంగా నడుస్తున్న పెళ్లి చూపులు సినిమా తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావుకు భలే నచ్చేసింది. సార్వజనీన అంశాలతో పెళ్లిచూపులు చిత్రం కొత్త పంథాకు నాంది పలికిందని ఆయన పొగిడేశారు.

KTR praises Pelli Chupulu film in Hyderabad

పెళ్లిచూపులు చిత్రాన్ని ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. పట్టణ యువత తాలూకు సున్నితమైన భావోద్వేగాల్ని ఈ సినిమాలో అందంగా ఆవిష్కరించారని, హీరో కంటే కథానాయికను బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలో చూపిస్తూ సినిమాలో చక్కటి సందేశాన్ని మేళవించారని అన్నారు.

ఏ భాషలో తీసినా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని, ఈ చిత్రంలో తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎక్కువ మంది భాగస్వామ్యులు కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ తరహా చిత్రాల్ని, ఉత్సాహవంతులైన నటీనటుల్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని మంత్రి అన్నారు.

KTR praises Pelli Chupulu film in Hyderabad

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు తరుణ్‌భాస్కర్, సమర్పకుడు డీ సురేష్‌బాబు, నిర్మాతలు రాజ్ కందుకూరి, యష్ రంగినేని, నాయికానాయకులు రీతూవర్మ, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి, మధుర శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+