Music University: తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ.. ప్రకటించిన కేటీఆర్..
తెలంగాణలో మరో యూనివర్సిటీ రాబోతుంది. రాష్ట్రంలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'మ్యూజిక్ స్కూల్' చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో కేటీఆర్ కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళ్లల్లో పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌తో పాటు సంగీతం సైతం ప్రాధాన్యంగా ఉండాలన్నారు.
ఇళయరాజాతో వేదిక పంచుకోవడం చాలా గౌరవంగా ఉందని తెలిపారు. ఈ సినిమా దర్శకుడు ఐఏఎస్ పాపారావుతో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు కేటీఆర్ చేసుకున్నారు. ప్రభుత్వం విధానాల రూపకల్పనలో పాపారావు భాగస్వామ్యం ఉందని కూడా పేర్కొన్నారు. 17 సంవత్సరాల తన తనయుడు హిమాన్షు మూడు నెలల కింద తాను ఓ పాటపాడాడని, రిలీజ్ చేస్తున్నానని చెప్పడంతో ఆశ్చర్యపోయానన్నారు. తన వాయిస్, ప్రతిభను చూసి ఆశ్చర్యపోయానని, ఎందుకంటే ఎలాంటి శిక్షణ లేకుండా ఆల్బమ్‌ను విడుదల చేశాడని చెప్పారు.

చాలా మందిలో ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని వెలికితీయాలన్నారు ఐఏఎస్ పాపారావు సినిమా తీశానని చెప్పగానే ఆశ్చర్యపోయానని కేటీఆర్ చెప్పారు. సైన్స్, టెక్నాలజీ అనేదే చదువు కాదని చెప్పడానికి పాపారావు ఈ మ్యూజిక్ స్కూల్ సినిమా తీశారని తెలిపారు. ఇక ఇళయరాజా మ్యూజిక్ యూనివర్సిటీ లాంటి వ్యక్తి అని.. ఆయన అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటైతే.. తనలాంటి ఇళయరాజాలు 200 మంది తయారవుతారన్నారు.












Click it and Unblock the Notifications