వారిది మేకపోతు గాంభీర్యం: ముందస్తుపై కేటీఆర్, హీరోలతో సందడి చేయనున్న మంత్రి
హైదరాబాద్: ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీది అందా మేకపోతు గాంభీర్యం అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. గతంలో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఇప్పుడు దేశానికి ధాన్య బాండాగారం తెలంగాణ అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ చెప్పారని తెలిపారు. గాంధీ చెప్పినా ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు అన్నారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీది కుంభకోణాల చరిత్ర అన్నారు. వందమంది పోరాటయోధులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు.
కమీషన్లు మోసుడు, కాంగ్రెస్ దద్దమ్మలకే తెలుసునని మండిపడ్డారు. అది తమ పార్టీకి తెలియదన్నారు. డిపాజిట్లు రావని వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. ముందస్తు ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది మేకపోతు గాంభీర్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము వంద సీట్లకు పైగా గెలుస్తామని చెప్పారు.

సినిమా కార్యక్రమంలో కేటీఆర్ సందడి
ఇదిలా ఉండగా, ఓ కార్యక్రమం కోసం కేటీఆర్, రానా, నాగ చైతన్య, విజయ్ దేవరకొండలు ఒకే వేదిక పైకి రానున్నారు. తరుణ్ తెరకెక్కించిన తాజా చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?'. ఈ చిత్రం ట్రయలర్‌ను రానా ఇటీవల విడుదల చేశారు. 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధమైంది. రావి నారాయణ్ రెడ్డి ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నలుగురు వస్తున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కథానాయకులు రానా దగ్గుబాటి, నాగచైతన్య, విజయ్ దేవరకొండ వస్తున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications