చంద్రబాబు భూ సేకరణ లో రేవంత్ భూములు - నిర్ణయం వెనుక..!!

ఫార్ములా-ఈ రేస్‌ కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏ -1 గా నమోదు చేసారు. ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ చెబుతున్నారు. ఈ ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణ వెనుక చోటు చేసుకున్న ఆసక్తి కర పరిణామాలను వెల్లడించారు. 2001 లోనే చంద్రబాబు ఫార్ములా రేసు కోసం ప్రయత్నించారని గుర్తు చేసారు. అదే సమయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు.. రేవంత్ భూముల గురించి కీలక అంశాలను చెప్పుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో
ప్రస్తుతం ఫార్ములా-ఈ రేస్‌ కేసులో కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా కేటీఆర్ నిధుల విడుదల పైన పలు అభియోగాలు నమోదయ్యాయి. వీటి పైన తాజాగా కేటీఆర్ వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఫార్ములా-ఈ రేస్‌ ద్వారా దేశానికి.. తెలంగాణ .. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ఆలోచన ఉందని పేర్కొన్నారు. 2001 లోనే నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు హైదరాబాద్ లో ఫార్ములా కార్ రేసు నిర్వహణ కోసం చేసిన ప్రయత్నాలను కేటీఆర్ వివరించారు. నాడు ఈ రేసు నిర్వహణ కోసం చంద్రబాబు ఎఫ్ -1 సీఈవో బెర్నీని కలిసిన విషయాన్ని గుర్తు చేసారు.

KTR Reveals interesting factors that Chandra Babu planned for Formula car race in Hyderabad

రేవంత్ భూములు
హైదరాబాద్ లో ఫార్ములా రేసు నిర్వహణ ద్వారా బ్రాండ్ ప్రమోషన్ కోసం ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. దీని కోసం అప్పుడు గోపన్‌పల్లిలో ఫార్ములా రేసు కోసం భూమి సేకరించారని కేటీఆర్ వివరించారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ హాయంలో గోపన్ పల్లిలో 580 ఎకరాల భూ సేకరణకు రెవిన్యూ శాఖ నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. అక్కడే సర్వేనంబర్‌ 127లో 15 ఎకరాల భూమి రేవంత్‌రెడ్డికి ఉందని వెల్లడించారు. ఈ వివరాలను తన ఎన్నికల అఫిడవిట్‌లో కూడా రేవంత్‌ పేర్కొన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే, 2004లో ప్రభుత్వం మారటంతో ట్రాక్ ఏర్పాటు ప్రతిపాదనలు నిలిచిపోగా.. ఆ భూముల కోసం రైతులు ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తున్నారని కేటీఆర్ వివరించారు.

కేసు నమోదుతో
ఫార్ములా రేస్ నిర్వహణ ద్వారా రాష్ట్రానికి బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుందని చెప్పారు. నోయిడాలో 2011, 12, 13 వరుసగా మూడేండ్లు ఫార్ములా-వన్‌ రేసు నిర్వహించారని గుర్తు చేసారు. 25 ఏళ్ల కల తమ హయాంలో నెరవేరిందని పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్‌ విషయంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై అక్రమంగా కేసు నమోదు చేసినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. తాము తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకొచ్చారు. కేసులకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటామని పునరుద్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+