అధికారులపై కెటిఆర్ ఆగ్రహం
ప్రభుత్వం సంపాదించుకున్న మంచి పేరంతా అధ్వాన్నంగా తయారైన నగర రహదారులవల్ల పోతున్నదని జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ అధికారులపై మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించడానికి అధికారులు కనీసం సీరియస్‌గా లేరని అంటూ ఇకనుంచి ఇలాంటి పరిస్థితిని ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. మెరుగైన పనితీరు కనబర్చని అధికారులను ఎలాంటి మొహమాటం లేకుండా సస్పెండ్ చేస్తానని తేల్చిచెప్పారు. నగరంలో రోడ్ల స్థితిగతులపై జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ సిబ్బంది, మెట్రో రైలు, జలమండలి, టీఎస్‌ఐఐసీ తదితర విభాగాల అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు.












Click it and Unblock the Notifications