గులాబీ 'కూలీ': కేటీఆర్ చేసిన ఐస్‌క్రీమ్‌‌ను రూ.5లక్షలకు కొన్న మల్లారెడ్డి

తొలి ఐస్ క్రీమ్‌ను ఎంపీ మల్లారెడ్డి రూ.5లక్షలకు కొనుగోలు చేయగా.. ఆ తర్వాత నిజాంపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రూ.5లక్షలకు మరో ఐస్ క్రీమ్ కొనుగోలు చేశారు.

హైదరాబాద్: గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించినట్లుగానే ఆ పార్టీ నేతలంతా కూలీ పనుల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొంపల్లిలోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఐస్ క్రీమ్ అమ్మకాలు జరిపారు. ఈ సందర్బంగా ఆ పార్టీకి చెందిన ఎంపీ మల్లారెడ్డి ఓ ఐస్‌క్రీమ్‌ను ఏకంగా రూ.5లక్షలకు కొనుగోలు చేయడం విశేషం.

కొంపెల్లి పరిధిలోని సుచిత్ర చౌరస్తాలో ఉన్న ఓ ఐస్‌క్రీం పార్లర్ లో స్వయంగా ఐస్ క్రీమ్ తయారుచేసి కేటీఆర్ విక్రయించారు. తొలి ఐస్ క్రీమ్‌ను ఎంపీ మల్లారెడ్డి రూ.5లక్షలకు కొనుగోలు చేయగా.. ఆ తర్వాత నిజాంపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రూ.5లక్షలకు మరో ఐస్ క్రీమ్ కొనుగోలు చేశారు.

ఐస్ క్రీమ్ లే కాకుండా కేటీఆర్ తయారుచేసిన టీ, కాఫీలు కూడా భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం. మొత్తం ఈరోజు కూలీ పని ద్వారా కేటీఆర్ తన తరుపున రూ.7లక్షలు పార్టీ కోసం సంపాదించినట్లు తెలుస్తోంది.

Ktr sales ice creams in suchitra

కాగా, ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గులాబీ కూలీ దినాలుగా పాటించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా వచ్చిన డబ్బుతో 21న టీఆర్‌ఎస్ ప్లీనరీని అదేవిధంగా 27వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులంతా గులాబీ కూలీ దినాల్లో పాల్గొంటున్నారు.

దీంతో పాటు తెలంగాణలో అత్యధికంగా నమోదైన సభ్యత్వాల ద్వారా దాదాపు రూ.25కోట్ల వరకు వచ్చే అవకాశముందని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+