కేటీఆర్ ఎద్దా.. ? దున్నపోతా .. ? ఆయనకు కూడా తెల్వదంట !?
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు విమర్శల తీవ్రత పెంచడం కామన్. ఒక్కోసారి హద్దులు దాటుతూ ఉంటారు కూడా. చివరకు ఒకర్ని ఒకరు పశువులతో పోల్చుకుంటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని వెరైటీ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందులో బాగంగా నేతలు తమను తామే కామెంట్ చేసుకుంటూ ఉంటారు. ప్రజలను ఇంప్రెస్ చేద్దామనుకున్నాడో ... ప్రాస బాగుందనుకుండో కాని తెలంగాన సీఎం తనయుడు .. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడు. ఆయన అభిమానులను , టీఆర్ఎస్ కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేశాడు.

నేను ఎద్దునా .. దున్నపోతునా నాకు తెల్వదు.
కరీంనగర్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా కేటీఆర్ ఆదివారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంభీరావు పేటలో జరిగిన సభలో మాట్లాడిన కేటీఆర్ టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో తమకు ఓటేసిన ప్రజలు, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమకే ఓట్లు వెయ్యాలని కోరాలనే ప్రయత్నంలో కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వ్యవసాయదారులు బండికి రెందు ఎద్దులను .. లేదంటే రెండు దున్నపోతులను కడతారని ఆయన వివరించారు. ఒకటి ఎద్దు .. మరొకటి దున్నపోతు అయితే బండి ముందుకు సాగదని చెప్పుకొచ్చారు. అలాగే మొన్న టీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలు, రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కే ఓటు వెయ్యాలని పిలుపు నిచ్చారు. అంతటితో ఆగకుండా తాను ఎద్దునో .. దున్నపోతునో తనకు మాత్రం తెల్వదని కామంట్ చేసి సంభలో నవ్వులు పూయించారు.

పదిరోజులు కష్టపడి వినోద్ ను గెలిపించండి.. ఐదు సంవత్సరాలు సేవ చేస్తాడు..
రానున్న ఎన్నికల్లో వినోద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. తెలంగాణలో ప్రజలకు సేవకులుగా .. డిల్లీలో తెలంగాణ సైనికులుగా తమ పార్టీ నేతలు కష్టపడుతున్నారని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్ఎస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యకర్తలు , ప్రజలు రానున్న పది రోజులు కష్టపడి వినోద్ ను గెలిపిస్తే .. రానున్న ఐదు సంవత్సరాలు ప్రజలకు ఆయన సేవచేస్తాడని కేటీఆర్ హామీ ఇచ్చారు.

చేతులున్నోల్లు ఎవరు .....?
కేటీఆర్ తన ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఇందులో భాగాంగనే అప్పుుడప్పుుడు మాటల్లో నవ్వులు పూయిండం పరిపాటిగా మారింది. సీరియస్ గా ప్రచారం చేస్తే జనాలకు ఎక్కుతుందో లేదో అనుకున్నాడో ఏమో , ట్రెండ్ మార్చేశాడు. ప్రసంగం చివరలో ప్రజలను వెరైటీ పలకరిస్తున్నాడు గంబీరావు పేట జరిగిన సభలో ఆయన చేతులు ఉన్నోళ్లు అంతా చేతులెత్తండి అంటూ అకట్టుకునే ప్రయత్నాం చేశారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తామని చేతులు ఉన్నోళ్లు అంతా పైకి ఎత్తి చూపించాలని కోరారు.అటు ఇటు తిరుగుతు అందరిని పలకించే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications