వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జై' వస్తున్నాడా.. ఆందోళన వద్దు, జూ.ఎన్టీఆర్ నా స్నేహితుడే: కేటీఆర్ సరదాగా

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఇచ్చిన సరదా సమాధానం అందరినీ ఆకట్టుకుంటుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఇచ్చిన సరదా సమాధానం అందరినీ ఆకట్టుకుంటుంది.

 రావణుడి పైకి రాముడి బాణం.. కేటీఆర్ పోస్ట్

రావణుడి పైకి రాముడి బాణం.. కేటీఆర్ పోస్ట్

రెండు రోజుల క్రితం దసరా పర్వదినం సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావణుడి పైకి శ్రీరాముడు బాణం వేస్తున్నట్లుగా ఉన్న ఫోటోను పెట్టారు.

 జై వస్తున్నాడు జాగ్రత్త

జై వస్తున్నాడు జాగ్రత్త

దీనిపై ఓ నెటిజన్ కేటీఆర్! సర్ జాగ్రత్త 'జై' వస్తున్నాడు అని సరదాగా పోస్ట్ పెట్టాడు. ఇటీవల నటుడు జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినేయంతో జై లవ కుశ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

 కేటీఆర్ పోస్టుకు సరదాగా

కేటీఆర్ పోస్టుకు సరదాగా

ఈ సినిమాలో జై పాత్రధారి.. రావణాసురుడిని దహనం చేస్తుంటే ఆపుతాడు. ఈ నేపథ్యంలో సదరు నెటిజన్.. కేటీఆర్ పెట్టిన రావణ దహనం పోస్టుకు సరదాగా జై వస్తున్నాడు అని పెట్టాడు.

 ఎన్టీఆర్ నాకు స్నేహితుడు.. ఆందోళన వద్దు

ఎన్టీఆర్ నాకు స్నేహితుడు.. ఆందోళన వద్దు

దీనిపై కేటీఆర్ కూడా అంతే సరదాగా స్పందించారు. సోదరా.. ఆందోళన అవసరం లేదని చెబుతూ.. తారక్ (ఎన్టీఆర్) తనకు మంచి స్నేహితుడు అని, ఆయన 'జై' గురించి చూసుకుంటాడని పేర్కొన్నారు.

English summary
'Don’t worry brother. tarak9999 is a dear personal friend of mine. I am sure he would take care of Jai' Telagana Minister KT Rama Rao says in twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X