భయపెట్టారు, మరో 20 ఏళ్లు కేసీఆరే సీఎం: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం నాడు తన అమెరికా పర్యటన వివరాలను విలేకరులతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే హైదరాబాదు నుండి పెట్టుబడులు తరలిపోతాయని ఎంతోమంది భయపెట్టారని, కానీ అలాంటి దాఖలాలు లేవన్నారు.

ఏడాది కాలంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామి చెప్పారు. ఈ సందర్భంగా సంజయ్ బారు రాసిన రెండు విషయాలు చెప్పాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని తాను గతంలో చెప్పానని, అది ముందు ముందు తెలుస్తుందని చెప్పారని, దాంతో పాటు మరో విషయం పేర్కొన్నారని చెప్పారు.

హైదరాబాద్ మహా నగరం పైన తనకు గతంలో అనుమానాలు ఉండెనని, ఇప్పుడు అవి తొలగిపోయాయని సంజయ్ బారు చెప్పారని, తద్వారా.. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మేధావి వర్గం ఇఫ్పుడు సానుకూలత వ్యక్తం చేస్తోందంటే... తెరాస ప్రభుత్వం ఆ మేరకు విజయాలు సాధించినట్లేనని అన్నారు.

KTR says no power cuts in Telangana

సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే కరెంట్ కోతలు ఉంటాయని హెచ్చరించారని, కానీ ఆయన హయాంలో మాత్రం పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేశారన్నారు.

ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఎక్కడా విద్యుత్ కోతలు లేవన్నారు. చరిత్రలో లేని ఎండలు ఇప్పుడు ఉన్నాయని, అయినప్పటికీ విద్యుత్ కోత లేదని అన్నారు. జనరేటర్, ఇన్వర్టర్ల బిజినెస్ దెబ్బతినేలా మేం చేశామని చమత్కరించారు. రాబోయే ఐదేళ్లలో దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు.

అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ వస్తే హైదరాబాదు నుండి తరిమేస్తారని, లా అండ్ ఆర్డర్ బాగుండదని విమర్శించారని, ఇప్పుడు ఈ ఏడాదిలో ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదన్నారు. కొందరు భయాలు కల్పించారని, కానీ ఇప్పుడు అంతా సాఫీగా సాగుతోందన్నారు.

దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడిందన్నారు. సమగ్ర, దీర్ఘకాలిక లక్ష్యాలతో తెరాస ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. లో కాస్ట్ హైవ్యాల్యూస్ హ్యూమన్ రీసోరెస్స్ హైదరాబాదులో ఉన్నాయని ప్రపంచం గుర్తించిందన్నారు.

అన్ని రంగాల్లో సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ సర్కారు దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే ఐదేళ్లలో ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ 61 ఏళ్ల యువకుడని, ఆయన మరో ఇరవై ఏళ్లపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటారని, పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+