మోస్ట్ ఇన్సిపిరేషనల్ ఐకాన్‌గా కెటిఆర్: తెలుగు సినిమా నుంచి రామ్ చరణ్ తేజ
హైదరాబాద్: ప్రజా జీవితంలో మార్పులకు అవిరళ కృషి చేసినందుకు గాను తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రజా జీవితంలో అద్బుతమైన ప్రగతి సాధించినందుకుగాను లైఫ్ స్టైల్ మ్యాగజైన్ రిట్జ్-సీఎన్‌ఎన్-ఐబీఎన్ సంయుక్తంగా మోస్ట్ ఇన్‌స్పిరేషన్ ఐకాన్ అవార్డును ప్రకటించాయి.
పాలనలో ఉత్తమ ప్రమాణాలు, ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడని ప్రశంసించాయి. అవార్డును అందుకున్న తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ - సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోన్న ప్రభుత్వానికి ఇది గుర్తింపు అని వ్యాఖ్యానించారు.

తనదైన పరిపాలనా పద్ధతులు, ఆలోచనా విధానంతో తెలంగామ ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించినట్లు, పరిపాలనలో ఉన్నత ప్రమాణాలను నిలిపేందుకు కృషి చేస్తున్న తెలివైన నాయకుడని కెటిఆర్‌ను జ్యూరీ అభినందించింది. ప్రజల అవసరాలపై అపారమైన జ్ఞానం ఉన్న కొత్తతరం రాజకీయ నాయకుడిగా అభివర్ణించింది.
ఈ మేరకు కెటిఆర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ జ్యూరీ ఈ మెయిల్ పంపించింది. త్వరలోనే సంస్థ సీనియర్ ప్రతినిధి బృందం స్వయంగా కలిసి మంత్రిని అవార్డు కార్యక్రమానికి అహ్వానిస్తుందని చెప్పిందది.
కెటిఆర్‌తో పాటు పలువురు ప్రముఖులకు కూడా ఆయా రంగాల్లో అవార్డులను ప్రకటించింది. వ్యాపార రంగంలో గ్రంధి మల్లికార్జున రావు, తెలుగు చలనచిత్ర రంగంలో రాం చరణ్ తేజలకు అవార్డులు ప్రకటించింది.












Click it and Unblock the Notifications