కేటీఆర్ కీలక వ్యాఖ్యలు: పక్క రాష్ట్రంలో దారుణ పరిస్థితులు : కరెంటు- రోడ్లు లేవు - అవినీతి..!!
తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్నదని చెబుతూనే..పక్క రాష్ట్రంలో పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. ఎక్కడా రాష్ట్రం పేరెత్తలేదు. హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో విద్యుత్..రోడ్ల నిర్వహణతో పాటుగా ఎక్కడా రూపాయి అవినీతికి ఆస్కారం లేదని కేటీఆర్ స్పష్టం చేసారు. అదే సమయంలో పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని మిత్రులు చెప్పారని పేర్కొన్నారు.పక్క రాష్ట్రంలో రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారంటూ వ్యాఖ్యానించారు.
పక్క రాష్ట్రంలో పరిస్థితి అధ్వానం, అన్యాయంగా ఉందని చెప్పారు. తన మిత్రుడ సంక్రాంతికి పక్క రాష్ట్రంకు వెళ్లారని..అక్కడ మూడు రోజులు ఉండే సరికి అక్కడ అధ్వాన్న పరిస్థితుల గురించి తనతో షేర్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. వాళ్ల ఊరు నుంచి వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారన్నారు. తాను చెప్పేదేది అతిశయోక్తి కాదన్నారు. పక్క రాష్ట్రం వెళ్లి తెలుసుకోవచ్చని సూచించారు. తెలంగాణ గురించి తాను డబ్బా కొట్టుకోవడం కాదు.. మీరే వెళ్లి చూడండంటూ సూచించారు. పక్క రాష్ట్రం వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారని ధీమా వ్యక్తం చేసారు.

పక్క రాష్ట్రంలో పరిస్థితిని బస్సులు పెట్టి జనాన్ని పంపి చూపించండంటూ మిత్రులు సూచించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అక్కడ విద్యుత్ లేదని..రోడ్లు లేవని పేర్కొన్నారు. మౌళిక సదుపాయల్లో హైదరాబాద్ అద్బుతంగా ఉందని వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ కట్టాలంటే లంచాలు చెల్లించాల్సిందేనని.. అధికార - ప్రతిపక్షాలకు లంచాలు ఇచ్చి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. కానీ తెలంగాణలో భవనాల అనుమతుల్లో అవినీతి లేకుండా చేశామన్నారు. తెలంగాణలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్నదని చెప్పారు.
తెలంగాణ రాకముందు కరెంటు కోతలు ఉండేవని, రాష్ట్రం వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే ఆ సమస్య లేకుండా చేశామన్నారు. సాగుకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో అన్ని నగరాల కంటే హైదరాబాద్ ఉత్తమమని చెప్పుకొచ్చారు. ఎంత ఖర్చు చేసి తెలంగాణలో భవనాలు నిర్మించుకొనే వారి దగ్గర నుంచి రూపాయి లంచం తీసుకొనే పరిస్థితి లేదని కేటీఆర్ వివరించారు. ఇక, ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications