ఢిల్లీపెద్దలకు రూ.25 వేలకోట్లు ఇచ్చేందుకే రేవంత్ మూసీ సుందరీకరణ.. రాహుల్ వీడియోతో!
తెలంగాణా రాష్ట్రంలో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఆక్రమణలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మూసీ పరీవాహక ప్రాంతాలలో కూడా ఆక్రమణలను తొలగించే పనిలో భాగంగా అధికారులు ఇల్లిల్లూ తిరిగి మార్కింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ మూసీ నేపధ్యంలో పేద నిరుపేదల ఆవేదన అర్ధం చేసుకున్న తాము మూసీ బాధితులకు అండగా ఉంటామని, బుల్డోజర్ ను అడ్డుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
రాహుల్ గాంధీ వీడియోతో కేటీఆర్ టార్గెట్
ఇక రాహుల్ గాంధీ గతంలో తుక్కుగూడలో మాట్లాడిన వ్యాఖ్యల వీడియో షేర్ చేసి కాంగ్రెస్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ప్రియమైన రాహుల్ గాంధీ మీ సీఎం చేస్తున్న బుల్డోజర్ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం గొంతు మీకు చేరిందా? అని ప్రశ్నించారు. చిన్న పిల్లలతో సహా ఎవరు పిలిచినా వస్తానని మీరు వాగ్దానం చేసారు. ఇప్పుడు మూసీ బాధిత ప్రజలు పిలుస్తున్నారు రావాలన్నారు.

మూసీ ప్రాజెక్టు బాధిత ప్రజలను కలవండి.. రాహుల్ కు కేటీఆర్
గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ న్యాయ పత్రం విడుదల చేసి తుక్కుగూడ నుండి మీరు మాట్లాడిన వ్యాఖ్యలే ఇవి. మీ మాట మీద నిలబడండి. వాస్తవాన్ని మీరే చూడండి. మూసీ ప్రాజెక్టు బాధిత ప్రజలను కలవండి అంటూ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ వీడియో పోస్ట్ చేసి టార్గెట్ చేశారు.
Dear @RahulGandhi, has the voice of Telangana's public against the bulldozer politics of your CM reached you? You promised to come when a youngster, the people, or even a child calls out
— KTR (@KTRBRS) October 1, 2024
Here’s your video from Tukkuguda at the Congress Nyay Patra release. Stand by your word and… pic.twitter.com/ElqoIefH5s
పేదల ఇళ్ళను మూసీలో కలిపే సుందరీకరణ దేనికి?
మూసీ పరీవాహక ప్రాంతాలు అయిన హైదర్‌గూడలోని లక్ష్మీనగర్, బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్ ప్రాంతాల్లో కేటీఆర్ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్ ఆలీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి సోమవారం పర్యటించారు. మూసీ వెంట మార్కింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి బాధితుల గోడు విన్నారు. పేదల ఇండ్లను మూసీలో కలిపే సుందరీకరణ ఎందుకు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మూసీ సుందరీకరణ వెనుక రేవంత్ రెడ్డి కమిట్మెంట్
మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు రూ.25 వేల కోట్లు ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ఇచ్చారని, అందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోట్ల విలువజేసే ఆస్తులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పరిహారంగా ఇవ్వాలని చూస్తున్నారని , ఇది కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గమైన చర్యలకు నిదర్శనమని నిప్పులు చెరిగారు.
రేవంత్‌రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తగులుతుందన్న కేటీఆర్
మొదట సంపన్నులనే టార్గెట్ చేస్తున్నామని చెప్పి మొదలు పెట్టి ఇప్పుడు నిరుపేదల ఇళ్ళు కూలుస్తున్నారని, రెక్కాడితేనే డొక్కాడే పేదలను నిలువ నీడ లేకుండా చేస్తున్నారని టార్గెట్ చేశారు. రెక్కల కష్టంచేసి కట్టుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు వస్తున్న రేవంత్‌రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
నీ సోదరుడి ఇంటిని ఎందుకు కూల్చడం లేదో చెప్పు రేవంత్
పేదల గూడులను కూల్చేసే మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ ప్రయోజనం లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బఫర్‌జోన్ పేరిట మూసీ వెంట మార్కింగ్ చేస్తున్న రేవంత్‌రెడ్డి, దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఆయన సోదరుడి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు. తన వాళ్లకు ఒక న్యాయం పేదలకు మరొక న్యాయం దేనికో చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications