గొప్ప లీడర్‌వి స్వామి: జపాన్‌లో చిరంజీవి, కేటీఆర్ ఫోటోపై ఆసక్తికరమైన స్పందన

Recommended Video

    ‘చిరంజీవి’ని జపాన్‌లో చూసి కేటీఆర్ షాక్..!

    హైదరాబాద్: జపాన్‌లోని షిజోకో ప్రాంతంలోని హమామట్సు పట్టణంలో సుజుకి మ్యూజియంలో నటుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి ఫోటోను చూసి థ్రిల్ అయినట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

    ఈ మేరకు కేటీఆర్ ఇందుకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ చేసిన చిత్రంలో చిరంజీవితో పాటు వినాయకుడు, మహాత్మా గాంధీ, తాజ్ మహల్ కూడా ఉన్నాయి. కేటీఆర్ పెట్టిన ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. జపాన్‌లో చిరంజీవి ఫోటో ఉండటం, దానిని కేటీఆర్ ట్వీట్ చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    మెగాస్టార్ ఫోటో షేరింగ్‌పై నెటిజన్లు

    మెగాస్టార్ ఫోటో షేరింగ్‌పై నెటిజన్లు

    అద్భుతం అని పలువురు అన్నారు. ఇదీ మెగాస్టార్ అంటే అని మరొకరు రీట్వీట్ చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ మెగాస్టార్ అని, జపాన్‌లో మన మెగాస్టార్‌కు గుర్తింపు అద్భుతమని మరొకరు పేర్కొన్నారు. అమలాపురం అయినా, అమెరికా అయినా జపాన్ అయినా మెగాస్టార్ క్రేజ్ అని, ఇప్పటి వరకు సీనియర్ ఎన్టీఆర్-చిరంజీవిలు మాత్రమే ఈ స్థాయికి చేరుకున్న నటులు అని మరొకరు పేర్కొన్నారు.

    ఐకాన్ గ్లోబల్ ఐకాన్ చిరంజీవి

    ఐకాన్ గ్లోబల్ ఐకాన్ చిరంజీవి

    చిరంజీవికి జపాన్‌లో ఉన్న గుర్తింపును తమ దృష్టికి తెచ్చినందుకు థ్యాంక్స్ అని, మెగాస్టార్ అంటేనే స్ఫూర్తివంతమైన వ్యక్తి అని, ఇలాంటి అద్భుతమైన పిక్చర్ షేర్ చేసినందుకు ధన్యావాదాలు అని, గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ఇండియా అని ప్రశంసల వర్షం కురిపించారు.

     పిచ్చెక్కి నీకు ఫిదా అవ్వడానికి

    పిచ్చెక్కి నీకు ఫిదా అవ్వడానికి

    మరికొందరు నెటిజన్లు ఆసక్తికర ట్వీట్లు కూడా చేశారు. నువ్వు గొప్ప లీడర్‌వి స్వామి, ఈ ఒక్క ట్వీట్ చాలు, వాళ్లకి పిచ్చెక్కి నీకు ఫిదా అవ్వడానికి అని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ మీ స్పీచ్‌కు అభిమానిని అంటు మరొకరు పేర్కొన్నారు. దేవుడు ఎక్కడైనా ఉంటాడని ఓ అభిమాని పేర్కొన్నారు. జై చిరంజీవి.. జై కేటీఆర్, జై ఆంధ్రా... జై టీఎస్ అని మరొకరు రీట్వీట్ చేశారు.

     మెగాస్టార్ విత్ కేటీఆర్

    మెగాస్టార్ విత్ కేటీఆర్

    మెగాస్టార్ విత్ కేటీఆర్ సర్ అని మరొకరు పేర్కొన్నారు. మరో నెటిజన్ కూడా ఆసక్తికరంగా రీట్వీట్ చేశారు. ఈ చిత్రంలో మహాత్మా గాంధీ, గణేషుడు, తాజ్ మహల్ కూడా ఉన్నాయని, రియల్ అచీవర్, స్టార్ మెగాస్టార్ అని పేర్కొన్నారు. చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పేర్కొన్నారు.

     ఇద్దరు మెగాస్టార్లు

    ఇద్దరు మెగాస్టార్లు

    సతీష్ అనే ట్విట్టరిటీ స్పందిస్తూ.. కేటీఆర్ గారు ఈ చిత్రాన్ని శిక్షణ సమయంలో తాను రెండేళ్ల క్రితం చూశానని, అద్భుతమని, మరోసారి దీనిని గుర్తు చేశారని పేర్కొన్నారు. ఇద్దరు మెగాస్టార్లను ఒకేచోట చూసినందుకు ఆనందంగా ఉందని, ఒకరు సినిమాల్లో మెగాస్టార్ అని, మరొకరు అడ్మినిస్ట్రేషన్‌లో మెగాస్టార్ అని చిరంజీవి, కేటీఆర్‌లపై ప్రశంసలు కురిపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+