కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ కేటీఆర్ తీరు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త వివాదం మొదలైంది. తాజాగా కీలకమైన బీసీల అంశం పైన జరిగిన నిరసనలకు దూరంగా ఉన్న కేటీఆర్.. పొంగులేటి వ్యవహారంలో ఉత్సాహంగా కనిపించటం పైన సొంత పార్టీలోనే చర్చ మొదలైంది. ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కేటీఆర్ పైన కొత్త చర్చ మొదలైంది. తాజాగా బీఆర్ఎస్ బీసీల సమస్యల పైన నిరసనలు చేపట్టి.. అమర వీరుల స్థూపం వద్ద ఆందోళనకు దిగింది. ఆ సమయంలో కేటీఆర్ నిరసనలకు దూరంగా ఉన్నారు. కాగా, మంత్రి పొంగులేటి పైన ఆరోపణల వేళ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనల్లో కేటీఆర్ ముందుండి నడిపించారు. ఈ తీరుతో కేటీఆర్ రాజకీయంగా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారనేది స్పష్టం అవుతోందనే చర్చ మొదలైంది.

బీసీల అంశం పైన పోరాటం చేస్తున్న సమయంలో ముందు ఉండాల్సిన కేటీఆర్.. మౌనంగా ఉండటంతో బీసీ సంఘాలు ఈ వ్యవహారం పైన అసహనం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయంగా కేటీఆర్ ప్రాధాన్యతలు ఏంటనేది స్పష్టం అవుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. వ్యక్తుల కోసం చేసే పోరాటానికి ముందుంటున్న కేటీఆర్.. బీసీల సమస్యల పైన ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీసీలకు ఇచ్చిన హామీల పైన నిలదీస్తూ నిరసనకు దిగారు.

ktr-skips-bc-issues-protest-turns-focus-on-ponguleti-srinivasa-reddy-fresh-row-erupts

బీసీ నేతల్లో కొనసాగుతున్న చర్చ

బీసీ సబ్‌ ప్లాన్‌ .. ఏటా బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల హామీ ఏమైందంటూ తాజాగా బీఆర్ఎస్ నేతలు నిరసన నిర్వహించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఊసేలేదని.. కాంట్రాక్టుల్లో వాటా అసలే లేదు. ఇచ్చిన హామీలు తప్పారంటూ.. బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించడాన్ని నిరసిస్తూ గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నిరసన చేపట్టారు. దీనికి కేటీఆర్ గైర్హాజరయ్యారు. కాగా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనల్లో మాత్రం కేటీఆర్ పాల్గొన్నారు.

అదే విధంగా పొంగులేటి భూకబ్జాల పైన గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేసారు. కాగా.. కీలకమైన బీసీ సమస్యల పైన జరిగిన నిరసనలకు దూరంగా ఉన్న కేటీఆర్.. పొంగులేటి అంశానికి ప్రాధాన్యత ఇస్తూ హాజరు కావటం పైన బీసీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో, ఇప్పటికే రాజకీయంగా ఫిక్స్ అవుతున్న వేళ కేటీఆర్ కు ఈ వివాదం మరింత సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+