రేవంత్ 50 ట్రిప్స్.. జీరో రిజల్ట్స్..!!
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రేవంత్ హస్తిన పర్యటనల పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా... ఫ్లైట్ బుకింగ్స్‌తో రేవంత్ నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్ ఢిల్లీ యాత్రలకు.. తెలంగాణకు ఏ సంబంధం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో అర్ధ శతకం సాధించారని ఎద్దేవా చేసారు.
ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ ఢిల్లీలో నిర్వహస్తున్న ఒక సదస్సుకు హాజరయ్యారు. రేవంత్ వరుస ఢిల్లీ పర్యటనల వేళ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్ హస్తిన పర్యటన 50 ట్రిప్స్.. జీరో రిజల్ట్స్ గా పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు ఇవే.. మొదటి పని - ఫ్లైటు టికెట్ బుక్ చేయడం.. రెండో పని - ఢిల్లీకి పోవడం.. మూడో పని - ఖాళీ చేతులతో తిరిగి రావడమని కేటీఆర్ విశ్లేషించారు. రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు.. రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదు.. సాగునీళ్లు రావు.. తాగునీళ్లు లేవు.. కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదని విమర్శించారు.

బనకచర్ల నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన రేవంత్ కు లేదని కేటీఆర్ మండిపడ్డారు. హామీ ఇచ్చిన ఉద్యోగాలు... జాబ్ క్యాలెండర్ల జాడ లేదని విమర్శించారు. రైతు భరోసా అమలు కాలేదని... తులం బంగారం, రూ 4 వేల ఫించన్ ఎక్కడని ప్రశ్నించారు. కానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతున్నాడు.. దిగుతున్నారని ఎద్దేవా చేసారు. 50 సార్లకు చేరిన హస్తిన యాత్రతో తెచ్చింది ఏమీ లేదన్నారు. తెలంగాణకు నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ.. దానికి బదులు దక్కింది మాత్రం... ఫోటో షూట్లు, వీడియోలు అని ఎద్దేవా చేసారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలని... ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదంటూ కేటీఆర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications