కేసీఆర్ మనవడా.. మజాకా?

Kalvakuntla Himanshu Rao: భారత్ రాష్ట్ర సమితి అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు.. కాబోయే బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌‌తో కలిసి దిగిన ఫొటోను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినందున అభినందించారు.

హౌస్ ఆఫ్ కామన్స్‌పై అకడమిక్ స్టడీ టూర్‌ కోసం గత ఏడాది లండన్ వెళ్లినప్పుడు స్టార్మర్‌ను కలిసే అవకాశం వచ్చిందాయనకు. అప్పట్లో ఆయన పార్లమెంట్ సభ్యుడు. హాల్బర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్ నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తాజాగా బ్రిటన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ప్రధాని అభ్యర్థిగా స్టార్మర్ ఎన్నికయ్యారు.

KTR son Himanshu Rao congratulates to UK s next PM Keir Starmer and shared a Photo with him

దీన్ని పురస్కరించుకుని ఆయనతో కలిసి దిగిన ఫొటోను హిమాన్షు రావు షేర్ చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఫొటో దిగడానికి గల సందర్భాన్ని వెల్లడించారు. బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన కీర్ స్టార్మర్‌ను కంగ్రాట్స్ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను ఆయనకు ట్యాగ్ చేశారు.

1962లో లండన్‌లో జన్మించారు కీర్ స్టార్మర్. అనంతరం కుటుంబంతో కలిసి సర్రేలోని ఆక్స్‌టెడ్‌కు వెళ్లారు. తండ్రి టూల్ మేకర్. తల్లి నర్స్. తన 16వ ఏటే రాజకీయాల్లో అడుగుపెట్టారు. లేబర్ పార్టీలో జాయిన్ అయ్యారు. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ లాలో డిగ్రీ పూర్తి చేశారు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్శిటీ నుంచి సివిల్ లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు.

KTR son Himanshu Rao congratulates to UK s next PM Keir Starmer and shared a Photo with him

చదువు పూర్తయిన తరువాత మావన హక్కుల బారిస్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. నార్తరన్ ఐర్లాండ్ పోలిసింగ్ బోర్డ్ మానవ హక్కుల సలహాదారుగా పని చేశారు. 2008 నుంచి 2013 వరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2015లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయయారు.

2020లో లేబర్ పార్టీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. అప్పటివరకు ఆ స్థానంలో ఉన్న జెరెమి కార్బిన్.. 2019 నాటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో తప్పుకొన్నారు. దీనితో స్టార్మర్‌కు ఆ అవకాశం లభించింది. స్టార్మర్ పక్కా వెజిటేరియన్. లేబర్ పార్టీలో కొనసాగుతూ మాంసాహారానికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలను సైతం నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+