జిల్లాలు చిన్నవి అయిన మాట వాస్తవమే: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల ఏర్పాటు అనుకున్న దానికంటే చిన్నవి అయిన మాట వాస్తవమేనని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో ఎన్టీఆర్ మండల వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి విమర్శలే వచ్చాయని తెలిపారు. జిల్లాల పునర్విభజన వల్ల మూడు లాభాలున్నాయని మంత్రి తెలిపారు. ప్రజలకు పరిపాలనా సౌలభ్యం, రెండో స్థాయి నాయకత్వ ఎదుగుదల, పెత్తందారి వ్యవస్థ నిర్మూలనకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ఉపయోగమని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications