రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ వ్యూహాత్మక పర్యటనలు.. నేడు సంగారెడ్డిలో కేటీఆర్ పర్యటన!!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్న క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రూటు మార్చారు. గతంలో ప్రతిపక్ష పార్టీల విమర్శలను పెద్దగా పట్టించుకోని కేటీఆర్, ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా నిత్యం ప్రతిపక్ష పార్టీల తీరు పై నిప్పులు చెరుగుతున్నారు. డోస్ పెంచి మరీ తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలను తిట్టిపోస్తున్నారు. ముఖ్యంగా బిజెపి ని టార్గెట్ చేస్తున్న కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నేతలపై, కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వంపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

కేటీఆర్ జిల్లాల పర్యటనల వ్యూహం అందుకే
రూటు మార్చిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాక్షేత్రంలో పట్టు సాధించడం కోసం జిల్లాల వారీగా వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్న కేటీఆర్, అక్కడ ఏర్పాటు చేస్తున్న సభలలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రస్తావించి, ప్రతిపక్ష పార్టీలపై మండిపడుతున్నారు. ఇదే సమయంలో టిఆర్ఎస్.. మేం పక్కా లోకల్ అంటూ, లోకల్ పార్టీ గా పబ్లిసిటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కేటీఆర్ పర్యటనలు వ్యూహాత్మక పర్యటనలని, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు సాధించడం కోసం ఇది కేటీఆర్ ఎత్తుగడ అని తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది.

రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుండే కష్టపడుతున్న కేటీఆర్
ఇటీవల కాలంలో యుద్ధ ప్రాతిపదికన మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారు. జిల్లాలలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్ ఆయా జిల్లాలలో పార్టీ నేతలలో ఉన్న అంతర్గత కలహాలను దూరం చేసి వారంతా కలిసికట్టుగా ఉండేలా చర్చలు జరుపుతున్నారు. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే రంగంలోకి దిగిన కేటీఆర్ తనదైన దూకుడుని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
ఇక ఇదే క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జహీరాబాద్ లో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. నిమ్జ్ తొలి పరిశ్రమ స్థాపనకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు. నిమ్జ్ లో 1000 కోట్లతో 511 ఎకరాలలో పరిశ్రమ నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం వాయు ఈవీ పరిశ్రమను కేటీఆర్ ప్రారంభించనున్నారు.

జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో కేటీఆర్ బహిరంగ సభ
మహీంద్రా ట్రాక్టర్లు 3 లక్షల యూనిట్ల ఉత్పత్తిని పూర్తి చేసిన సందర్భంగా మహీంద్రా కంపెనీలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక స్మారకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో ఆయన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మారుతున్న పరిస్థితులను బట్టి తమ ప్రాధాన్యతలను మార్చుకుంటూ మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణాష్ట్రంలో పర్యటనలు సాగిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications