సుందర ట్యాంక్‌బండ్ సందర్శనకు ట్రాఫిక్ ఆంక్షలు: నెటిజన్ సూచనకు కేటీఆర్ అనూహ్య స్పందన
హైదరాబాద్: నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్‌బండ్. నగర వాసులతోపాటు నగరానికి వచ్చిన అనేక మంది పర్యాటకులు చూడాలని భావించే ఆకర్షణీయ ప్రదేశాల్లో ఒకటి. సెలవు దినాల్లో ఈ ప్రదేశానికి చాలా మంది నగరవాసులు, పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ చేసిన సూచన తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కూడా నచ్చింది.

ట్యాంక్‌బండ్ సందర్శనకు ట్రాఫిక్ ఇక్కట్లు
అదేమంటే.. ట్యాంక్‌బండ్‌పై ప్రతీ ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని ఓ నెటిజన్ సూచించారు. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. పౌరుల సూచన ఆహ్వానించదగినదని భావించిన మంత్రి.. హైదరాబాద్ పోలీసు బాస్‌కు కీలక సూచనలు చేశారు. తమ సిబ్బందితో కలిసి ఆదివారం రోజున సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షల విషయంపై యోచించాల్సిందిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

నెటిజన్ సూచనకు కేటీఆర్ నుంచి అనూహ్య స్పందన
ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఈ మేరకు సూచన చేశారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు ఎందుకు విధించకూడదు. ట్యాంక్‌బండ్‌పై తమ ప్రభుత్వం కల్పించిన అందమైన సౌకర్యాలను నగర పౌరులు ఆస్వాదిస్తారు. వాహనాల నిరంతర ప్రయాణంతో కుటుంబాలతో కలిసి వచ్చేవారు రోడ్డును కుడి నుంచి ఎడమకు.. ఎడమ నుంచి కుడికి దాటేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాగా, అశోక్ చంద్రశేఖర్ అనే ఈ నెటిజన్ సూచనను స్వాగతించిన మంత్రి కేటీఆర్.. దీనిపై పరిశీలించాల్సిందిగా హైదరాబాద్ సీపీకి సూచించారు.

చారిత్రక ట్యాంక్‌బండ్ సందర్శన..
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న సుందర సరస్సు హుస్సేన్ సాగర్. దీనికి తూర్పు వైపున ట్యాంక్ బండ్ రోడ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలను కలిపే రహదారి. 450 సంవత్సరాల పురాతన సరస్సుపై సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూసేందుకు నగర వాసులు తరలివస్తుంటారు. సెలవు రోజుల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. 2.2 కిలోమీటర్ల పొడవైన ఈ విశాల రహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఉన్నాయి. ప్రముఖ తెలుగు కవులు, స్వాతంత్య్ర సమరయోధులు, నాయకుల విగ్రహ చిహ్నాలు కొలువుదీరి ఆకట్టుకుంటున్నాయి.

సుందరంగా ముస్తాబవుతున్న ట్యాంక్‌బండ్..
సికింద్రాబాద్ వైపు రహదారిలో యుద్ధ ట్యాంక్ పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఆధునిక హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించే విధంగా, ప్రపంచస్థాయి నగర కూడలిగా ట్యాంక్‌బండ్‌ను తీర్చిదిద్దాలనే కేటీఆర్ విజన్ మేరకు ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. అటు చారిత్రక వైభవానికి ప్రతీకగా, ఇటు ఆధునిక కలబోతగా ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. రూ.38 కోట్ల అంచనా వ్యయంతో మొదటిదశ సుందరీకరణ పనులు చేపట్టిన మున్సిపల్ విభాగం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాస్ట్ ఐరన్ రైలింగ్, గ్రిల్స్, డిజైనర్ ల్యాంప్ పోస్టులను ఇప్పటికే ఏర్పాటు చేసింది. కాలిబాటలు కూడా ఫ్లేమ్‌డ్ గ్రానైట్‌తో పునరుద్దరించబడ్డాయి.
Recommended Video
త్వరలోనే సందర్శకులకు ట్రాఫిక్ నుంచి రిలీఫ్..?
ప్రస్తుతం సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. సీటింగ్, షాపింగ్, పార్కింగ్‌తో సహా సౌకర్యాలను సమకూరుస్తున్నారు. రెండో దశలో సరస్సు వెంబడి లేక్ వ్యూ నైట్ బజార్‌ను అభివృద్ధి చేయనున్నారు. సహజ సౌందర్యం సొంతం చేసుకున్న హుస్సేన్‌సాగర్ బోటింగ్, చుట్టుపక్కల పార్కులు లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, పీపుల్స్ ప్లాజా, ఫుడ్ పాయింట్లు, ఈట్ స్ట్రీట్, ఐమాక్స్ థియేటర్ వంటి సదుపాయాలతో వేలాది మందిని ఆకర్షిస్తుంటుంది. ఇటువంటి సుందర ప్రదేశాన్ని ప్రశాంతంగా వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్ నియంత్రణ అవసరమేన్న పౌరుల విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సై అన్నారు. మంత్రి సూచన నేపథ్యంలో సెలవు దినమైన ఆదివారం రోజున ట్యాంక్‌బండ్‌పై నగర ప్రజలు, పర్యాటకులు స్వేచ్ఛగా సందర్శనను కొనసాగించే అవకాశం త్వరలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications