హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ సీఎం..కేసీఆర్ సూపర్ సీఎం:తనయుడి పట్టాభిషేకానికి రంగం సిద్ధం?

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: త్వరలోనే టీఆర్‌ఎస్‌లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయా..? సీఎం కేసీఆర్ తనయుడు గులాబి యువనేత కేటీఆర్ సీఎం పదవిని అధిష్టించనున్నారా...? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే కేసీఆర్ పరిస్థితి ఏంటి..? రాజకీయాలకు గుడ్‌బై చెబుతారా లేక పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారా..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

కేటీఆర్ వైఖరి ముమ్మాటికి తప్పు..! తెలంగాణ వాదులు టీఆర్‌ఎస్‌ లో ఎందుకుండాలన్న విజయ శాంతి..!!కేటీఆర్ వైఖరి ముమ్మాటికి తప్పు..! తెలంగాణ వాదులు టీఆర్‌ఎస్‌ లో ఎందుకుండాలన్న విజయ శాంతి..!!

 కేటీఆర్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్

కేటీఆర్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్

తెలంగాణలో అధికారిక టీఆర్ఎస్ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మంత్రి కేటీఆర్.. త్వరలో నెంబర్ వన్ స్థానంకు ప్రమోషన్ పొందనున్నట్లు సమాచారం. ఈ మేరకు గులాబీ బాస్ కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2020లో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రగతి భవన్ సమాచారం. కొత్త సంవత్సర కానుకగా కేటీఆర్‌కు సీఎం కిరీటాన్ని తండ్రి కేసీఆర్ బహూకరించనున్నట్లు తెలుస్తోంది.

సూపర్ సీఎంగా ఉండనున్న కేసీఆర్

సూపర్ సీఎంగా ఉండనున్న కేసీఆర్

ఒక వేళ కేటీఆర్ ముఖ్యమంత్రిగా వెళితే మరి కేసీఆర్ పరిస్థితి ఏంటనేది చాలామందిలో నెలకొన్న అనుమానం. కొడుకు కేటీఆర్ సీఎం అయితే... తండ్రి కేసీఆర్ సూపర్ సీఎం స్థానంలో ఉంటారని ప్రగతి భవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం. అంటే యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉండి, యూపీఏ ఛైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ ఎలా అయితే ఉన్నారో కేసీఆర్ కూడా రాష్ట్రస్థాయిలో అలాంటి పదవిని అధిష్టిస్తారని సమాచారం.

 ఇదే సూపర్ సీఎం టీమ్

ఇదే సూపర్ సీఎం టీమ్

ఇక సూపర్ సీఎం టీమ్‌లో లేదా సలహా మండలిలో ఛైర్మెన్‌గా కేసీఆర్, కొత్త సీఎంగా కేటీఆర్, ఇతర మంత్రులు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు డిప్యూటీ ఛైర్మెన్ బి.వినోద్ కుమార్, ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మతో పాటు మరికొందరు ముఖ్యులు ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం ఏదైనా అంశంపై ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆ అంశం ఈ సలహామండలి వద్దకు ముందుగా వెళుతుంది. అక్కడ చర్చించిన తర్వాతే దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సలహామండలికి ఛైర్‌పర్సన్‌గా కేసీఆర్‌ ఉంటారు కనుక ఆయన అభీష్టంమేరకే నిర్ణయం జరుగుతుంది. అంతేకాదు పాలనాపరమైన అంశాలపై ఏమంత్రి అయినా, అధికారితోనైనా చర్చించే సర్వాధికారాలు కేసీఆర్‌కు ఉంటాయని సమాచారం. అంటే మొత్తం మీద సలహామండలి ఒక పవర్‌ఫుల్ మండలిగా తయారు కానుంది.

 2019 పార్లమెంటు ఎన్నికలప్పుడే...

2019 పార్లమెంటు ఎన్నికలప్పుడే...

వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు కేసీఆర్. ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు స్పష్టమైన మెజార్టీ రాకపోతే కేంద్రంలో ప్రాంతీయపార్టీలతో కలిపి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తాను ప్రధానిగా కావాలనుకున్నారు కేసీఆర్. అయితే అది సాధ్యపడలేదు. తాను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయబాహుటా ఎగురవేసిన తర్వాత తొలి ప్రెస్‌మీట్‌లో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా అన్న విలేఖరుల ప్రశ్నకు సానుకూలంగా స్పందించారు. దానిపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు తప్పితే కేటీఆర్ ముఖ్యమంత్రి రేసులో లేరని మాత్రం చెప్పలేదు.

 మంత్రిగా నిరూపించుకున్నాను

మంత్రిగా నిరూపించుకున్నాను

ఇక కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవగానే తాను కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో రాజకీయాల్లోకి ప్రవేశించడం వరకే తన తండ్రి పాత్ర ఉందని ఆ తర్వాత తన స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగినట్లు చెప్పారు. ఒక మంత్రిగా తాను ఏంటో నిరూపించుకున్నట్లు చెప్పిన కేటీఆర్... పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారని చెప్పారు. అలాంటప్పుడు కాంగ్రెస్‌లో కూడా చాలామంది సీనియర్లు ఉండగా... రాహుల్ గాంధీకి ఆ సమయంలో అధ్యక్ష పగ్గాలు ఎలా అప్పజెప్పారని ప్రశ్నించారు.

మొత్తానికి 2020లో గులాబీ అభిమానులకు పండగ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ తన తనయుడు మంత్రి కేటీఆర్‌ను సీఎంగా ప్రమోట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు ప్రచారంలో ఉండటంతో గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.

English summary
Telangana Rashtra Samiti (TRS) president and Chief Minister K. Chandrasekhar Rao is considering constituting a “Telangana State Advisory Council”.It will be constituted when KCR’s son, Mr K.T. Rama Rao, takes over as CM, and KCR will chair it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X