‘ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో’: కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ సెటైర్లు
హైదరాబాద్: అవసరమైన సమయంలో విద్యుత్ సరాఫరా చేయడం లేదని, కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ కర్ణాటకలోని కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానికంగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్‍కు ట్రాక్టర్‌లో ఓ మొసలిని తీసుకొచ్చారు.
కరెంట్ ఇస్తారా?.. సబ్ స్టేషన్‌లో మొదలిని వదలాలా? అంటూ సిబ్బందిని రైతులు ప్రశ్నించారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా, ఈ వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. 'ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో' అంటూ కాంగ్రెస్ సర్కారుపై సెటైర్లు సంధించారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వడం వల్ల పొలాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని కర్ణాటకలోని రైతులు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలానికి వెళ్తున్నప్పుడు స్థానిక కాలువల నుంచి మొసలి పిల్లలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వన్యప్రాణులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే రాత్రి పొలానికి వెళ్లిన సమయంలో దొరికిన మొసలిని ట్రాక్టర్‌లో తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయితే, కార్యాలయం వద్దకు వచ్చిన అటవీశాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించి సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో 😄 https://t.co/oGp0pJhgZV
— KTR (@KTRBRS) October 24, 2023
కరెంటు కష్టాలపై మంత్రి కేటీఆర్ చేసిన రీట్వీట్‌పై బీఆర్ఎస్ శ్రేణులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటి పండుగలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలకే పరిమితం చేద్దాం.. ఈ దిక్కుమాలిన పండుగలను తెలంగాణకు తీసుకురాకుండా కాంగ్రెస్, బీజేపీలను తరిమికొడదామని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కరెంటు లేక జిరాక్స్ సెంటర్ దగ్గర రెండు గంటలు కరెంటు కోసం నిలబడిన రోజులు మళ్లీ వస్తాయోమో అని మరో నెటిజన్.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కటిక చీకట్లే అని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications